సీఎం జగన్‌ నోట.. ఆంధ్రజ్యోతి మాట

ABN , First Publish Date - 2020-10-17T23:34:13+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదిపై చోడవరం దగ్గర బ్యారేజీ నిర్మించాలని క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, చోడవరం బ్యారేజీకి అనుసంధానంగా...

సీఎం జగన్‌ నోట.. ఆంధ్రజ్యోతి మాట

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదిపై చోడవరం దగ్గర బ్యారేజీ నిర్మించాలని క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, చోడవరం బ్యారేజీకి అనుసంధానంగా కృష్ణా తూర్పు ప్రాంతంలో విజయవాడ వెలుపల నుంచి బైపాస్‌ను నిర్మించటం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, బైపాస్‌కు కేంద్రం నిధులు ఇస్తే అటు బ్రిడ్జి, ఇటు రోడ్డును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టవచ్చునని ఆంధ్రజ్యోతి ప్రచురించిన ప్రత్యేక కథనం ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవంలో ప్రస్తావనకు వచ్చింది.


ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఆంధ్రజ్యోతి కథనంలో సూచించిన ‘తూర్పు బైపాస్‌’ అంశాన్ని ప్రస్తావించారు. దాదాపు 78 కిలోమీటర్ల పొడవైన ఈ నిర్మాణాన్ని చేపట్టాలని గడ్కరీని కోరారు. అయితే భూసేకరణ భారాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై మోపవద్దని అభ్యర్థించారు. దీనిపై గడ్కరీ స్పందిస్తూ కేంద్రం మీద భారం ఎక్కువ పడకుండా ఉంటానికి మైనింగ్‌ సెస్‌ మినహాయింపు, స్టీల్‌, సిమెంట్‌ వంటి మెటీరియల్స్‌పై జీఎస్‌టీలో మినహాయింపు ఇవ్వాలని సూచించారు. విజయవాడ అవుటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టుకు గడ్కరీ సానుకూలంగా స్పందించారు.

Updated Date - 2020-10-17T23:34:13+05:30 IST