ప్రజల సొమ్ముతో సీఎం జగన్‌ ప్రచారాలు

ABN , First Publish Date - 2022-08-07T06:38:21+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌రెడ్డి ప్రజల సొమ్ముతో వలంటీర్లను నియమించుకొని పథకాలను ప్రచారం చేయించుకుంటున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు లక్షల మంది వలంటీర్లకు రూ.4 వేల కోట్లు ప్రభుత్వ ధనాన్ని గౌరవవేతనంగా ఇస్తున్నారన్నారు.

ప్రజల సొమ్ముతో సీఎం జగన్‌ ప్రచారాలు
సమావేశంలో మాట్లాడుతున్న బుద్ద నాగజగదీశ్వరరావు

 టీడీపీ జిల్లా అధ్యక్షుడు ‘బుద్ద’ 

 అనకాపల్లి అర్బన్‌, ఆగస్టు 6 : వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌రెడ్డి ప్రజల సొమ్ముతో వలంటీర్లను నియమించుకొని పథకాలను ప్రచారం చేయించుకుంటున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు లక్షల మంది వలంటీర్లకు రూ.4 వేల కోట్లు ప్రభుత్వ ధనాన్ని గౌరవవేతనంగా ఇస్తున్నారన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక వలంటీర్లకు అప్పగిస్తున్నారని, దానివల్ల కొందరు  ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరో పించారు. ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తామని ప్రజలను బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వలంటీర్ల వల్ల వ్యవస్థ భ్రష్టుపట్టిపోతోందన్నారు. సాక్షి పత్రిక సర్క్యులేషన్‌ పెంచుకోవడానికి వలంటీర్లకు రూ.200లు చొప్పున చెల్లిస్తున్నారని వివరించారు.  టీడీపీ నాయకులు ధూళి రంగనాయకులు, జి.శ్రీరామ్మూర్తి గణేష్‌, కోటేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-07T06:38:21+05:30 IST