Consolation of the Chief Minister: అధైర్యం వద్దు.. అండగా ఉంటాం

ABN , First Publish Date - 2022-07-29T16:34:37+05:30 IST

దక్షిణకన్నడ జిల్లా బీజేపీ యువనాయకుడు హత్యకు గురైన ప్రవీణ్‌నెట్టారు(Praveen nettaru) కుటుంబికులను ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై

Consolation of the Chief Minister: అధైర్యం వద్దు.. అండగా ఉంటాం

- ప్రవీణ్‌ కుటుంబీకులను ఓదార్చిన ముఖ్యమంత్రి

- హత్యలో కేరళ వాసుల ప్రమేయం

- నిష్పక్షపాతంగా విచారణకు అవకాశం: సీఎం బొమ్మై


బెంగళూరు, జూలై 28 (ఆంధ్రజ్యోతి): దక్షిణకన్నడ జిల్లా బీజేపీ యువనాయకుడు హత్యకు గురైన ప్రవీణ్‌నెట్టారు(Praveen nettaru) కుటుంబికులను ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఓదార్చారు. గురువారం సుళ్య తాలూకాలోని బెళ్ళారె గ్రామానికి చేరుకున్న సీఎం ప్రవీణ్‌ ఇంటికి వెళ్ళారు. ప్రవీణ్‌ భార్య నూతనతోపాటు తల్లిని ఓదార్చారు. ప్రవీణ్‌ చిత్రపటానికి పూలు జల్లి నివాళులర్పించారు. అనంతరం కుటుంబీకులతో సుమారు 20నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడారు. మీ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. హంతకులను త్వరలోనే పోలీసులు పట్టుకుంటారన్నారు. ప్రవీణ్‌ హత్య(Praveen's murder) మాకు తీరని బాధగా ఉందని హంతకులు, వారి వెనుక ఉండే వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ... హత్యకు కేరళ వాసులతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోందని వారిని గుర్తించే ప్రక్రియ సాగుతోందన్నారు. ఇప్పటికే ఇరువురిని అరెస్టు చేశామని వారి వెనుక దాగి ఉండే శక్తులను వెలికి తీస్తామన్నారు. నిష్పక్షపాతంగా విచారణలు జరిపేందుకు పోలీసులకు అవకాశం ఇచ్చామన్నారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రవీణ్‌ హత్య జరిగినప్పటి నుంచి జిల్లా ఎస్‌పీ ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చారానన్నారు. రాష్ట్ర డీజీపీ ప్రవీణ్‌ సూద్‌ ఇప్పటికే కేరళ రాష్ట్ర డీజీపీతోను చర్చించారన్నారు. హత్య(murder)కు కేరళతో సంబంధాల దిశగా కూడా విచారణలు సాగుతున్నాయన్నారు. కేరళ పోలీసులు సంపూర్ణంగా సహకరిస్తామని భరోసా ఇచ్చారన్నారు. వెనుక ఉండే సంస్థలు వివరాలు విచారణలతో తేలుతాయన్నారు. హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి సునిల్‌ కుమార్‌, కోటా శ్రీనివాస పూజారి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, స్థా నిక ఎంపీ నళిన్‌కుమార్‌ కటీల్‌ సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-29T16:34:37+05:30 IST