బెంగళూరు: ప్రపంచ ఆర్ధిక సదస్సును విజయవంతంగా ముగించుకున్న ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శుక్రవారం రాజధానికి తిరిగి రానున్నారు. అంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సీఎం గురువారం బెంగళూరుకు తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ తన పర్యటనను మరొక రోజు విస్తరించుకున్నట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. చివరి క్షణంలో సీఎం రాక వాయిదాపడిందని తెలిపింది. పలు దేశాలకు చెందిన వాణిజ్య దిగ్గజాలతో రెండో విడుత చర్చలు జరుపాల్సి ఉండటంతో సీఎం తన పర్యటనను మరొక రోజు పొడిగించుకున్నారని ప్రకటనలో పేర్కొన్నారు. సీఎంకు స్వాగతం పలకడానికి పార్టీ నాయకులు సిద్ధమయ్యారు.
ఇవి కూడా చదవండి