250 పడకల ఆసుపత్రికి Cm శంకుస్థాపన

ABN , First Publish Date - 2022-02-25T17:13:17+05:30 IST

కోట్లాదిరూపాయల అభివృద్ధి పనులకు మహదేవపుర నియోజకవర్గంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై శ్రీకారం చుట్టారు. గురువారం మున్నెకొళాల గ్రామంలో 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి

250 పడకల ఆసుపత్రికి Cm శంకుస్థాపన

మహదేవపుర(కర్ణాటక): కోట్లాదిరూపాయల అభివృద్ధి పనులకు మహదేవపుర నియోజకవర్గంలో ముఖ్యమంత్రి  బసవరాజ్‌ బొమ్మై శ్రీకారం చుట్టారు. గురువారం మున్నెకొళాల గ్రామంలో 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం బొమ్మై మాట్లాడుతూ బెంగళూరు అభివృద్ధికి ఇప్పటికే 6వేల కోట్లు కేటాయించామన్నారు. రాజకాలువలను రూ.1500 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. జ్ఞాననగరి అయిన బెంగళూరులో 180 రీసెర్చ్‌ అండ్‌ డెవలెప్‌మెంట్‌ కేంద్రాలు ఉన్నాయన్నారు. నాల్గవదశ కావేరి నీటి పథకాన్ని, 2024 లోగా బెంగళూ రు మెట్రో గడువులోగా పూర్తి చేస్తామన్నారు. వర్తూరు ఫ్లై ఓవర్‌, మారతహళ్ళి పోలీస్ స్టేషన్‌ తదితర కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అరవింద లింబావళి, ఎంపీ పీసీ మోహన్‌, మంత్రి సుధాకర్‌లు భాగస్వామ్యులయ్యారు. అనంతరం ఎమ్మెల్యే లింబావళి మాట్లాడుతూ రూ.180 కోట్ల మల్టిస్పెషాలిటీ ఆసుపత్రి, వర్తూరులో 24 మీటర్ల వెడల్పుతో 2 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్‌ కారిడార్‌, బీబీఎంపీ నుంచి లింక్‌ రోడ్డు, మారతహళ్ళి పోలీస్ స్టేషన్‌ నూతన భవనానికి భూమిపూజ చేసినట్టు తెలిపారు. బీబీఎంపీలోని 110 గ్రామాలపైకి 31 గ్రామాలను నవనగరోత్థాన పథకం కింద అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. మహదేవపుర, బొమ్మనహళ్ళి, బెంగళూరు దక్షిణ ఇతర అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడంతోపాటు అదే రీతిన పన్నుల వసూళ్లు కూ డా పెరగాల్సి ఉందన్నారు. కాగా పలు కార్యక్రమాల్లో స్థానిక బీజేపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-25T17:13:17+05:30 IST