పంచారామాల మూసివేతకు ఆదేశాలు

ABN , First Publish Date - 2021-04-17T06:29:24+05:30 IST

కరోనావ్యాప్తి తీవ్ర దశకు చేరుతున్నందున మే 15 వరకూ పురాతన ఆలయాలను మూసివేయాలని భారతీయ పురావస్తు శాఖ న్యూఢిల్లీ నుంచి ఆదేశాలు జారీ చేసింది.

పంచారామాల మూసివేతకు ఆదేశాలు

  • దేవదాయ శాఖ ఆదేశాలు వచ్చే వరకు వేచిచూస్తాం: ఈవోలు

సామర్లకోట/ద్రాక్షారామ, ఏప్రిల్‌ 16: కరోనావ్యాప్తి తీవ్ర దశకు చేరుతున్నందున మే 15 వరకూ పురాతన ఆలయాలను మూసివేయాలని భారతీయ పురావస్తు శాఖ న్యూఢిల్లీ నుంచి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు సామర్లకోటలోని పురాతన ప్రసిద్ధి చెందిన చాళుక్య కుమారరామ భీమేశ్వరస్వామి దేవస్థానానికి శుక్రవారం అందాయి. కాగా భారతీయ పురావస్తు శాఖ నుంచి వచ్చిన ఆదేశాలు వాస్తవమేనని, అయితే రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకూ సామర్లకోట కుమారరామ భీమేశ్వరాలయాన్ని మూసివేయడం జరగదని ఆలయ కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి శుక్రవారం రాత్రి తెలిపారు. కరోనా అనంతరం ఆలయంలో భక్తుల రాక ఇప్పుడిప్పు డే పెరుగుతున్న ఈ తరుణంలో పర్వదినాల్లో విశేషపూజలు జరుగుతున్నాయని, భారతీయ పురావస్తుశాఖ ఉన్నతాధికారులు ఇక్కడి పరిస్థితులు ఏమాత్రం సమీక్షించకుండా ఆలయాన్ని మూసివేయాలని ఆదేశించడం సరికాద ని పలువురు పేర్కొన్నారు. అటు ద్రాక్షారామ భీమేశ్వరాలయం పురావస్తు రక్షణలోను, దేవ దాయశాఖ పరిపాలనలో ఉందని కార్యనిర్వహణాధికారి, జిల్లా సహాయ కమి షనరు కేఎన్వీడీవీ ప్రసాద్‌  తెలిపారు. ఆలయం మూసివేతపై దేవదాయ శాఖ రాష్ట్ర కమిషనరు ఆదేశాల మేరకు మాత్రమే తాము నడుచుకుంటామన్నారు.

Updated Date - 2021-04-17T06:29:24+05:30 IST