భారీ జీడి పరిశ్రమ మూసేయండి

ABN , First Publish Date - 2021-01-27T05:22:07+05:30 IST

త క్షణమే అధికారు లు, ప్రజాప్రతిని ధులు స్పందించి భారీ జీడి పరి శ్రమ మూసివే యాలని జీడి పరిశ్రమల్లో భారీ యంత్రాల వ్యతిరే క పోరాట కమిటీ డిమాండ్‌ చేసింది.

భారీ జీడి పరిశ్రమ మూసేయండి
రిలే దీక్షలు చేస్తున్న కార్మికులు

 కార్మికుల రిలే దీక్షలు  ఫ పలువురు నాయకులు సంఘీభావం

పలాస: త క్షణమే అధికారు లు, ప్రజాప్రతిని ధులు స్పందించి భారీ జీడి పరి శ్రమ మూసివే యాలని  జీడి పరిశ్రమల్లో భారీ యంత్రాల వ్యతిరే క పోరాట కమిటీ డిమాండ్‌ చేసింది.  మంగళవారం స్థాని క ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డులో పారిశ్రామికవాడలో ఇటీవల ప్రారంభించిన జీడి పరి శ్రమను  మూసివేయాలని కోరుతూ భారీ యంత్రాల వ్యతిరేక పోరాట కమిటీ ఆ ధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభించారు. తొలుత జీడి కార్మిక భవనం నుంచి కార్మి కులు భారీ ఊరేగింపు నిర్వహించారు. దీక్షలకు ప్రజాసంఘాలతో పాటు టీడీపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. వ్యతిరేక పోరాటసమితి కన్వీనరు అంబటి కృష్ణమూర్తి  శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు వంకల మాధవరావు, చాపర వేణుగోపాలరావు, మద్దిల రామారావు, తామాడ సన్యాసిరావు, జీడి కార్మిక సంఘ అధ్యక్షుడు బొంపల్లి సింహాచలం, ప్రధాన కార్యదర్శి బొమ్మాళి తాతయ్య మాట్లాడారు. జీడి పరిశ్రమల్లో భారీ యంత్రాల వల్ల కార్మికుల ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తంచేశారు. టీడీపీ నాయకుడు వజ్జ బాబూరావు, పార్టీ పట్టణాధ్యక్షుడు లొడగల కామేశ్వరరావుయాదవ్‌ మాట్లాడుతూ భారీ యంత్రాలతో కార్మికులు, వ్యాపారులకు నష్టమేనని  తెలిపారు. కార్యక్రమంలో గురిటి సూర్యనారాయణ, గాలి కృష్ణారావు, కోనారి రాము పాల్గొన్నారు.


Updated Date - 2021-01-27T05:22:07+05:30 IST