Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వం హామీలను నెరవేర్చాలి

ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

నెల్లూరు (విద్య) డిసెంబరు 8 : ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు. నగరంలోని సంతపేట రామకోటయ్యభవన్‌లో ఉన్న ఎస్‌టీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన పీఆర్సీని 2018 జూలై 1 నుంచి అమలు చేయాలని, సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న కరువుభత్యాలను వెంటనే విడుదల చేయడంతో పాటు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేయాలన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిపైనా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. రాష్ట్రంలో రెండు జేఏసీలు చేపడుతున్న ఆందోళనలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగ డుతూ సమస్యలన్నీ పరిష్కరించే వరకు జేఏసీ నేతలు బేషజాలకు పోకుండా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జోసఫ్‌ సుధీర్‌బాబు, ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాఽథరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి  ప్రభాకర్‌, ఎస్‌టీయూ జిల్లా అధ్యక్ష్య కార్యదర్శులు తాళ్లూరు శ్రీనివాసులు, రాజమనోహర్‌, ఆర్థిక కార్యదర్శి నరసింహం, నేతలు రమేష్‌బాబు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement