శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం
ఉరవకొండ, నవంబరు 27: నాడు-నేడు పేరుతో పాఠశాలలకు మహర్దశ అంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు... ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. అందుకు నిదర్శనమే లత్తవరం తండాలోని ప్రాథమిక పాఠశాల. ఈపాఠశాలను 1978లో నిర్మించారు. భవనం శిథిలావస్థకు చేరుకుని కూలడానికి సిద్ధంగా ఉంది. ఒకే తరగతి గదిలోనే ఐదు తరగతులను నిర్వహించేవారు. పాఠశాలలో 49 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గతంలో ఆ భవనంలోనే తరగతి గదులను నిర్వహించే వారు. ఇటీవల కురిసిన భారీ వ ర్షాలకు పాఠశాల గదులు మొత్తం వర్షానికి కారుతూ, గోడలకు నెర్రెలు చీలాయి. ఈ ప రిస్థితుల్లో పది రోజులుగా ఆర్డీటీ స్కూల్లోనే తరగతులను నిర్వహిస్తున్నారు. ‘భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో తరగతి గదులు కూలే ప్రమాదముంది. లోపలికి ఎవరూ ప్రవేశించరాదు’ అంటూ ప్రధానో పాధ్యాయుడు హెచ్చరిక బోర్డును గేటుకు వేలాడదీశారు. గ తంలో నాడు-నేడుకు ఎంపికైనా పాఠశాలకు మరమ్మతులు చేపట్టలేదని గ్రామస్థులు పే ర్కొంటున్నారు. గిరిజన గ్రామాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని వాపోయారు. నూతన గదులు మంజూరు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా స్పందించి నూతన గదుల నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.