ప్రభుత్వాల తీరుతో పేదలపై భారం

ABN , First Publish Date - 2021-06-11T05:16:35+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని ఆత్మకూరు బస్టాండ్‌, బుజబుజనెల్లూరు, రామకోటయ్యనగర్‌ తదితర ప్రాంతాల్లో నిరసన తెలిపారు.

ప్రభుత్వాల తీరుతో పేదలపై భారం
ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద సీఐటీయూ నేతల నిరసన

సీఐటీయూ నిరసనలు

నెల్లూరు(వైద్యం), జూన్‌ 10 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని ఆత్మకూరు బస్టాండ్‌, బుజబుజనెల్లూరు, రామకోటయ్యనగర్‌ తదితర ప్రాంతాల్లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం రూరల్‌ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు, సీఐటీయూ  జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్‌, నగర కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ కరోనా విపత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోకుండా వారిపై ఆర్థిక భారం మోపేలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కార్మిక చట్టాలను కాలరాసేలా, కార్పొరేట్లకు కార్మికులను బానిసలు చేసేలా కేంద్రం నూతన చట్టాలు చేసిందని మండిపడ్డారు. అలాగే వ్యవసాయ చట్టాలను మార్చటం ద్వారా రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న ఉద్యోగులకు రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, విధినిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల  సమ్మెకు సీఐటీయూ మద్దతు తెలుపుతోందని చెప్పారు. కేరళ తరహాలో ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేయాలని, మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని, రైల్వే, ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేతలు కత్తి శ్రీనివాసులు, సూర్యనారాయణ, కొండా ప్రసాద్‌, మోహన్‌, సుధాకర్‌ రెడ్డి, వెంగయ్య, మురళి, సుధాకర్‌, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-11T05:16:35+05:30 IST