జెల్లిపల్లి వద్ద కూలిన కల్వర్టు మీద నడుస్తూ వంక దాటేందుకు గ్రామస్థుల అవస్థలు
కంబదూరు, నవంబరు27: మండలంలోని జెల్లిపల్లి వద్ద వంకపై వున్న కల్వర్టు ఇ టీవల కురిసిన వర్షానికి కుప్పకూలింది. మరోవైపు కల్వర్టు శిథిలాల్లో వంక ఉధృతంగా ప్ర వహిస్తోంది. ఈపరిస్థితుల్లో ఏరు దాటేందుకు గ్రామస్థులు సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. అ డుగు తీసి అడుగేసేందుకు కూడా వీలులేకుండా పోయింది. దీంతో ఏ ప్రమాదం ముం చుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. జెల్లిపల్లి మీదుగా ఐదు గ్రామాలకు పైబడి ఈకల్వర్టు మీదనే ప్రయాణం సాగించాల్సి వస్తోంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు కూ లిన కల్వర్టు మీదే నడిచేందుకు నానాకష్టాలు పడుతున్నారు. నడవడానికి అతిప్రమాదకరంగా వున్నప్పటికి దేవుడిపై భారంవేసి నడవాల్సి వస్తోందని వాపోతున్నారు. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు స్పందించి కల్వర్టుకు మరమ్మతులు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.