Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్థరైటి‌స్‌ను దూరం చేసే దాల్చిన చెక్క

ఆంధ్రజ్యోతి(08-04-2021)

దాల్చిన చెక్కను ఆహారంలో వాడుతూ ఉంటాం. అయితే దాల్చిన చెక్కను తేనెతో కలిపి తీసుకుంటే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. 


దాల్చిన చెక్కను పొడి చేసుకోవాలి. తరువాత అందులో కొద్దిగా తేనె కలిపి పేస్టులా చేయాలి. బ్రేక్‌ఫా్‌స్టలో జెల్లీ, జామ్‌ బదులుగా దీన్ని తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే కొలెస్ట్రాల్‌ తగ్గి గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గిపోతుంది. 

రెండు టేబుల్‌స్పూన్ల తేనె, ఒక చిన్న టీ స్పూన్‌ దాల్చిన చెక్కపొడిని కప్పు వేడి నీళ్లతో కలిపి తీసుకుంటే ఆర్థరైటిస్‌ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు కూడా దూరమవుతాయి.

రెండు టేబుల్‌స్పూన్ల తేనె, మూడు టీస్పూన్ల దాల్చిన చెక్కపొడిని టీ వాటర్‌తో కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే రెండు గంటల్లోగా 10 శాతం కొలెస్ట్రాల్‌ తగ్గిపోతుంది. కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడే వారికి ఇది అద్భుతమైన చిట్కా.

జలుబుతో బాధపడుతున్నా ఒక టేబుల్‌స్పూన్‌ తేనె, పావు చెంచా దాల్చినచెక్క పొడిని రోజుకొకసారి మూడు రోజుల పాటు తీసుకోవాలి. ఇలా చేస్తే జలుబు, దగ్గు, సైనస్‌ సమస్యలు దూరమవుతాయి. 

దాల్చిన చెక్కను తేనె కలిపి తీసుకుంటే కడుపు నొప్పి తగ్గిపోతుంది. అల్సర్‌ సమస్య కూడా నయమవుతుంది.

రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేయడానికి అరగంట ముందు పరగడుపున కప్పు నీటిలో తేనె, దాల్చిన చెక్కపొడి వేసుకుని మరిగించుకుని తాగాలి. రాత్రి పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారు. 

ఒక టీ స్పూన్‌ తేనె, దాల్చిన చెక్క పొడిని గోరు వెచ్చటి నీళ్లలో వేసుకుని పుక్కిలిస్తే నోటి దుర్వాసన పోతుంది. 

రోజూ క్రమంతప్పకుండా దాల్చిన చెక్కపొడిని తేనెతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది.

Advertisement
Advertisement