దేశాన్ని రెండుగా విభజించారు

ABN , First Publish Date - 2022-04-30T15:07:46+05:30 IST

దేశాన్ని ఉత్తర, దక్షిణ భారతదేశాలుగా విభజించారని ప్రముఖ దర్శకుడు పా.రంజిత్‌ అరోపించారు. పైగా హిందీ ఆధిపత్యాన్ని సహించే ప్రసక్తే లేదని, ద్రావిడులంతా

దేశాన్ని రెండుగా విభజించారు

- ద్రావిడులంతా ఐక్యంగా ఉండాలి

- దర్శకుడు పా.రంజిత్‌ పిలుపు


అడయార్‌(చెన్నై): దేశాన్ని ఉత్తర, దక్షిణ భారతదేశాలుగా విభజించారని ప్రముఖ దర్శకుడు పా.రంజిత్‌ అరోపించారు. పైగా హిందీ ఆధిపత్యాన్ని సహించే ప్రసక్తే లేదని, ద్రావిడులంతా ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మదురైలోని ప్రపంచ తమిళ సంఘం ఆడిటోరియంలో శుక్రవారం ‘వానమ్‌’ ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో హిందీ భాష అధిక్యత ఉండడానికి కారణం అనేక రాష్ట్రాల్లో హిందీ మాట్లాడుతున్నారన్నారు. అంతేకాకుండా, దక్షిణ భారతదేశానికి చెందిన ప్రజల కంటే ఉత్తర భారతీయులు గొప్పవారు అనే భావన చాలా మందిలో ఉందన్నారు. ఇలాంటి ఆలోచన చాలా తప్పన్నారు. దేశంలో తమిళమే అనుసంధాన భాష (లింక్‌ లాంగ్వేజ్‌)గా ఉండాలన్నారు. దేశంలో ద్రావిడులకు ప్రాధాన్యత పెరగాలని, ద్రావిడులుగా మనమంతా ఐక్యంగా నిలబడాలని రంజిత్‌ పిలుపునిచ్చారు. సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యాఖ్యలపై స్పందిస్తూ, ‘ఇళయరాజా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వారి మానసికస్థితిని అర్థం చేసుకోవాలని ఆ కోణంలో తాను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. దళిత సాహిత్యంతో పాటు తనను చెక్కిన మహానుభావులు లేకుంటే తాను లేనని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ ఉత్సవాల సందర్భంగా దళిత సాహిత్యం అనే కార్యక్రమంలో 30 మందికిపైగా దళిత సాహితీవేత్తలు, రచయితలు, పరిశోధకులు, విమర్శకులు, కవులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-04-30T15:07:46+05:30 IST