Abn logo
Apr 10 2021 @ 22:30PM

ప్రభుత్వ వైద్యశాలల్లో సీఐడీ తనిఖీ

నెల్లూరు(క్రైం) : ఏప్రిల్‌ 10: నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రులు, ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు, కమ్యూనిటీ, ఏరియా వైద్యశాలల్లో శనివారం  సీఐడీ  అధికారులు తనిఖీలు చేశారు. ప్రభుత్వ వైద్యశాలల్లోని బయో మెడికల్‌ పరికరాల కొనుగోలులో జరిగిన అవకతవకలపై గుంటూరు జిల్లా మంగళగిరి సీఐడీ అధికారులు ఇటీవల కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ అనుసంధాన వైద్యశాలల్లో తనిఖీలు చేసి నివేదికలు ఇవ్వాలని సీఐడీ అడిషనల్‌ డీజీపీ పి.వి. సునీల్‌కుమార్‌ ఆదేశించారు. దాంతో నెల్లూరు రీజియన్‌ ఏఎస్పీ పి.ఆర్‌. రాజేంద్రకుమార్‌ ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, 11 మంది ఎస్‌ఐలతో కలిపి  మొత్తం 14 బృందాలుగా ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాలో  ఆరు, ప్రకాశం జిల్లాలో 8 బృందాలు అన్ని ప్రభుత్వ, అను సంధాన వైద్యశాలల్లో తనిఖీలు చేశాయి.

Advertisement
Advertisement
Advertisement