చిత్తూరు: జిల్లాలోని యాదమరి మండలంలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. పట్రపల్లి, సిద్ధారెడ్డి పల్లి, తంజావూరు గ్రామాల్లో పంటలపై 14 ఏనుగుల గుంపు దాడులు చేశాయి. దీంతో వరి, అరటి, మిరప, సెనగ పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. ఏనుగుల గుంపు సంచారంతో గ్రామాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి