చిరస్మరణీయుడు బాబూ జగ్జీవన్‌రామ్‌

ABN , First Publish Date - 2022-07-07T06:07:53+05:30 IST

చిరస్మరణీయుడు బాబూ జగ్జీవన్‌రామ్‌

చిరస్మరణీయుడు బాబూ జగ్జీవన్‌రామ్‌
గన్నవరం టీడీపీ కార్యాలయంలో జగ్జీవన్‌రామ్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ అర్జునుడు, నాయకులు

 ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు

గన్నవరం, జూలై 6 : జనం కోసం జీవి తాన్ని అంకితం చేసిన స్వాతంత్య్ర సమర యోధుడు డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ అని  టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పేర్కొన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నాయకులతో కలసి జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అర్జునుడు మాట్లాడుతూ, మూడు దశాబ్ధాల పాటు కేంద్ర మంత్రిగా దేశానికి విశేష సేవలు అందించిన ఘనుడు ఆయన అని కీర్తించారు. ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న,  జాస్తి వెంకటేశ్వరరావు,  సుబ్రమణ్యంరాజు,  మేడేపల్లి రమాదేవి, బోడపాటి రవి, నిమ్మకూరి మధు, ప్రభుదాస్‌, రమ్యకృష్ణ, హానోక్‌, సూర్యం, సులోచన రాణి, వంశీకృష్ణ, అయ్యప్పరెడ్డి, నాగయ్య, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

ఉయ్యూరు  : అణగారిన వర్గాల అభ్యు న్నతి, చట్ట సభల్లో హక్కుల కోసం పోరాడిన మహానాయకుడు బాబూ జగ్జీవన్‌ రామ్‌ అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేం ద్రప్రసాద్‌  కొనియాడారు. భారత మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి  సందర్భంగా బుధవారం రాజేంద్రప్రసాద్‌ నివాసం వద్ద జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీకాలనీ లో జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి మాజీ చైర్మన్లు జంపాన పూర్ణచంద్రరావు, ఖుద్దూస్‌, 5వ వార్డు కౌన్సిలర్‌ పరిమి సలోమి సంతోషితో పాటు పలువురు పూలమాల వేసి నివాళు లర్పించారు. ఈ కార్యక్రమంలో  జంపాన గుర్నాథరావు,  వడ్డే సాయిశోభన్‌,   మండవ జయదేవ్‌, రఫీ, పరిమి భాస్కర్‌, నజీర్‌,  పలియాల శ్రీనివాసరావు, అజ్మతుల్లా, నరేశ్‌, చిట్టిమోతు సుబ్బారావు, శివ పాల్గొన్నారు.

 పెనమలూరు  : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు జగ్జీవన్‌రామ్‌ వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. బుధవారం పోరంకిలోని టీడీపీ కార్యాల యంలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ టీడీపీ నేతలతో కలసి జగ్జీవన్‌రామ్‌ చిత్రప టానికి పూలమాల వేసి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కుర్రా నరేంద్ర, బొర్రా కృష్ణ, కోయ ఆనంద్‌, షేక్‌ బుజ్జి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

హనుమాన్‌జంక్షన్‌  : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆదర్శం నేటి సమాజానికి ఎంతో అవసరమని బాపులపాడు ఎంపీపీ వై.నగేష్‌ అన్నారు. బుధవారం మాజీ ప్రధాని  జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి సందర్భంగా బాపుల పాడు మండల పరిషత్‌ కార్యాల యంలో జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి ఎంపీపీ పూల మాలవేసి నివాళుర్పించారు. ఆయనతో పాటు జడ్పీటీసీ సభ్యురాలు కొమరవల్లి గంగాభవాని, ఎంపీడీవో కె.పార్థసారథి, కార్యాలయం సూపరింటెండెంట్‌ మారుతీ రావు, ఈవోపీఆర్డీ ప్రభాకర్‌రావు, పంచాయ తీరాజ్‌ ఏఈ జయరాజు పాల్గొన్నారు.

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌  : బలహీన వర్గాల ఆశాజ్యోతి  జగ్జీవన్‌రామ్‌  అని సర్పంచ్‌ పిల్లా అనిత కొనియాడారు. వీరవల్లిలో బుధవారం మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి సందర్భంగా కూడలి లోని జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఉంగుటూరు : ఉంగుటూరు ఎంపీపీ కార్యాలయ ప్రాంగణంలో ఎంపీడీవో జీఎస్‌వీ శేషగిరిరావు ఆధ్వర్యంలో బుధవారం భారత మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌  వర్ధంతిని  నిర్వహించారు. ఎంపీపీ సరోజిని, ఎంపీడీవో శేషగిరిరావు, తహసీల్దార్‌ వనజాక్షి తదితరులు జగజ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. సూపరింటెండెంట్‌ ఎన్‌. బసవయ్య, ఈవోపీఆర్డీ ఎం.అమీర్‌బాషా, ఎంఈవో జి.వెంకటేశ్వరరావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. 

 

 


Updated Date - 2022-07-07T06:07:53+05:30 IST