Advertisement
Advertisement
Abn logo
Advertisement

బాలుడిపై పంది దాడి

కావలి, డిసెంబరు 2: కావలి పట్టణం వెంగళరావునగర్‌లోని బైరాగుల కాలనీలో గురువారం 4 ఏళ్ల చిన్నారి శివరాజ్‌పై పంది దాడి చేసింది. ఇంట్లో ఉన్న బాలుడిని పంది బయటకు లాక్కొచ్చి గాయపరచటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో బహిర్భూమికి వెళ్లిన ఓ బాలుడిని పంది గాయపరచగా స్థానికులు మున్సిపల్‌ కమిషనర్‌ బీ.శివారెడ్డికి, ఆర్డీవో శీనా నాయక్‌కు ఫిర్యాదు చేశారు. అయినా పందులను నివారించటంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవటంతో అవి ఇళ్లలోకి వచ్చి బీభత్సం చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇళ్లలోకి వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులను చిందబందర చేసి వాటిని బయటకు లాక్కొని పోవటమే కాక ఇంట్లో ఉన్న పిల్లలపై కూడా దాడి చేసి గాయపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


Advertisement
Advertisement