కరాచీ పేలుడుతో పాకిస్థాన్‌కు చైనా హెచ్చరిక

ABN , First Publish Date - 2022-04-27T16:48:14+05:30 IST

కరాచీ ఆత్మాహుతి బాంబర్ దాడి ఘటనలో ముగ్గురు చైనీయుల మృతి నేపథ్యంలో చైనా పాకిస్థాన్ దేశానికి తాజాగా హెచ్చరిక జారీ చేసింది....

కరాచీ పేలుడుతో పాకిస్థాన్‌కు చైనా హెచ్చరిక

చైనీయుల భద్రతకు చర్యలు తీసుకోండి

బీజింగ్ (చైనా) : కరాచీ ఆత్మాహుతి బాంబర్ దాడి ఘటనలో ముగ్గురు చైనీయుల మృతి నేపథ్యంలో చైనా పాకిస్థాన్ దేశానికి తాజాగా హెచ్చరిక జారీ చేసింది.పాక్ దేశంలోని చైనా ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనీయుల భద్రతకు చర్యలు తీసుకోవాలని బీజింగ్ ఇస్లామాబాద్ ను డిమాండ్ చేసింది.మంగళవారం యూనివర్శిటీ ఆఫ్ కరాచీ ఆవరణలో జరిగిన కారులో పేలుడు సంభవించిన ఘటనలో మరణించిన నలుగురిలో ముగ్గురు చైనా జాతీయులు ఉన్నారు. కరాచీ యూనివర్శిటీలోని చైనీస్ భాషా బోధనా కేంద్రం కన్ఫ్యూషియస్ ఇనిస్టిట్యూట్ సమీపంలో వ్యాన్‌లో ఈ పేలుడు సంభవించింది.చైనీస్ స్టేట్ మీడియా ఈ పేలుడును ఖండించింది. చైనా ప్రాజెక్టు సిబ్బంది భద్రత కోసం పాకిస్తాన్ మరిన్ని ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేసింది.తమ చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడే శక్తులపై అత్యంత కఠినంగా ఉంటామని చైనా హెచ్చరించింది.


Updated Date - 2022-04-27T16:48:14+05:30 IST