వూహాన్‌ల్యాబ్‌కు చైనా గౌరవం

ABN , First Publish Date - 2021-06-23T08:53:07+05:30 IST

కరోనా వైరస్‌కు పుట్టిల్లుగా ప్రపంచమంతా అనుమానిస్తున్న వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌ను చైనా గొప్పగా గౌరవించింది.

వూహాన్‌ల్యాబ్‌కు చైనా గౌరవం

అత్యున్నత అవార్డుకు నామినేట్‌ చేసిన ‘చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’

బీజింగ్‌, జూన్‌ 22: కరోనా వైరస్‌కు పుట్టిల్లుగా ప్రపంచమంతా అనుమానిస్తున్న వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌ను చైనా గొప్పగా గౌరవించింది. 2021 సంవత్సరానికి ఆ దేశ అత్యున్నత సైన్స్‌ అవార్డు ఔట్‌స్టాండింగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అచీవ్‌మెంట్‌ ప్రైజ్‌కు నామినేట్‌ చేసింది. అలాగే బ్యాట్‌ ఉమన్‌గా పేరొందిన వైౖరాలజిస్టు, వూహాన్‌ ల్యాబ్‌ అధిపతి షీ ఝెంగ్లీ సేవల గురించి చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రత్యేకంగా పేర్కొంది. కొవిడ్‌-19కు కారణాలపై సమగ్రమైన పరిశోధన చేసినందుకే వూహాన్‌ ల్యాబ్‌ను ఈ అవార్డుకు నామినేట్‌ చేసినట్టు అకాడమీ పేర్కొంది.

Updated Date - 2021-06-23T08:53:07+05:30 IST