సరిహద్దు వద్ద కలకలం.. ఏకంగా 5 వేల మంది చైనా సైనికుల మోహరింపు

ABN , First Publish Date - 2020-05-27T00:04:57+05:30 IST

లద్దాఖ్ సెక్టర్‌లోని పలు ప్రాంతాలలో చైనా దాదాపు 5 వేల మంది సైనికులను మోహరించి ఉండొచ్చని తెలుస్తోంది.

సరిహద్దు వద్ద కలకలం.. ఏకంగా 5 వేల మంది చైనా సైనికుల మోహరింపు

న్యూఢిల్లీ: లద్దాఖ్ సెక్టర్‌లోని పలు ప్రాంతాలలో చైనా దాదాపు 5 వేల మంది సైనికులను మోహరించి ఉండొచ్చని ఈ వ్యవహారాలతో సంబంధం ఉన్న అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇరు దేశాల సైనికుల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం ఉన్నత స్థాయి కమేండర్ల మధ్య చర్చల ద్వారా కూడా సమసిపోలేదని సమాచారం. ఇరు దేశాల సైనికుల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం ఉన్నత స్థాయి కమేండర్ల మధ్య చర్చల ద్వారా కూడా సమసిపోలేదని సమాచారం. సరిహద్దు వద్ద ఉద్రిక్తలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.  ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు  మరింత దిగజారే ఆస్కారం ఉందని కొందరు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు భావిస్తున్నారు.  అయితే ఈ సైనిక మోహరింపు అంతా ప్రతిష్టంభన కొనసాగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉన్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టు సదరు అధికారి వ్యాఖ్యానించారు. మరోవైపు.. 2017 డోక్లామ్ ఉద్రిక్తత తరువాత అత్యంత ఉత్కంఠ రేపుతున్నది లద్దాఖ్ ప్రతిష్టంభనేనని చైనా మీడియా చెబుతోంది. కాగా.. సైనికులు సరిహద్దు దాటి పొరుగు దేశం భూభాగంలోకి ప్రవేశించనంత వరకూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ఇది చివరికి చర్చలకు దారి తీస్తుందని కూడా వారు అభిప్రాపడుతున్నారు. భారత్ కూడా చైనా అడుగులను నిశితంగా పరిశీస్తోందని, సరిహద్దుకు సమీపంలో తన బలగాలను పెంచుకుంటోందని ఉన్నతాధి కారి ఒకరు తెలిపారు. 


Updated Date - 2020-05-27T00:04:57+05:30 IST