వానల కోసం చైనా మేఘమథనం

ABN , First Publish Date - 2022-08-20T06:42:32+05:30 IST

తీవ్ర కరువును అధిగమించేందుకు చైనా మేఘమథనం(క్లౌడ్‌ సీడింగ్‌) ప్రారంభించింది. యాంగ్జీ నది

వానల కోసం చైనా మేఘమథనం

బీజింగ్‌, ఆగస్టు 19: తీవ్ర కరువును అధిగమించేందుకు చైనా మేఘమథనం(క్లౌడ్‌ సీడింగ్‌) ప్రారంభించింది. యాంగ్జీ నది పరీవాహక ప్రాంతం, హుబే ప్రావిన్స్‌లో కొన్ని రోజులుగా విమానాల ద్వారా మేఘాల్లోకి సిల్వర్‌ అయోడైడ్‌ను పంపించి వాటిని కరిగిస్తున్నారు. చైనాలో ఉష్ణోగ్రతలు గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నమోదవుతున్నాయి. వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరో వారం రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చాలా ప్రాంతాల్లో నదులు, సరస్సులు ఎండిపోయాయి. చైనాలో దాదాపు అన్ని ప్రాజెక్టుల్లో జల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఇప్పుడు ఉత్పత్తి లేక ప్రావిన్స్‌ మొత్తం కరెంటు కోతలతో అల్లాడుతోంది. ఫ్యాక్టరీలకు సెలవులు ఇస్తున్నారు.   

Updated Date - 2022-08-20T06:42:32+05:30 IST