Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారత్‌లో తగ్గిన శిశు మరణాలు

30 ఏళ్ల గణాంకాలను విడుదల చేసిన యూఎన్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: భారత్‌లో గత 30 ఏళ్లలో  చిన్నారుల మరణాల రేటు గణనీయంగా తగ్గిందని యునైటెడ్‌ నేషన్స్‌ నివేదిక వెల్లడించింది. ‘లెవెల్స్‌ అండ్‌ ట్రెండ్స్‌ ఇన్‌ చైల్డ్‌ మోర్టాలిటీ’ పేరుతో 1990-2019 కాలానికి సంబంధించిన గణాంకాలతో కూడిన నివేదికను యూఎన్‌ విడుదల చేసింది. అయితే.. గడచిన 30 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల మరణాల్లో మూడో వంతు నైజీరియా, ఇండియాలోనే నమోదయ్యాయని నివేదిక పేర్కొంది.


కరోనా విజృంభిస్తున్న వేళ మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలను హెచ్చరింది. ప్రపంచ వ్యాప్తంగా 1990లో చిన్నారుల మరణాల రేటు 12.5 మిలియన్లు కాగా, 2019 నాటికి ఇవి 5.2 మిలియన్లకు పడిపోయాయి. అదేవిధంగా యూనిసెఫ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం... ఇండియాలో ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల మరణాలు 1990లో 126 నమోదు కాగా, 2019 నాటికి ఇవి 34కు పడిపోయాయి. ఇండియాలో ఏడాదిలోపు వయసున్న  శిశు మరణాల్లోనూ తగ్గుదల కనిపించింది. 1990లో 24 లక్షలుగా ఉన్న ఈ మరణాలు, 2019 నాటికి 6,79,000కు పడిపోయాయి.

Advertisement

పిల్లల సంరక్షణమరిన్ని...

Advertisement