పిల్లలకు నాణ్యతతో కూడిన గుడ్డును అందించాలి

ABN , First Publish Date - 2021-10-19T04:54:13+05:30 IST

పిల్లలకు, గర్భిణులకు ఇస్తున్న కోడిగుడ్డు నాణ్యతతో అందించాలని జిల్లా శిశు సంక్షేమశాఖ అధికారి పద్మజ పేర్కొన్నారు.

పిల్లలకు నాణ్యతతో కూడిన గుడ్డును అందించాలి
కోడిగుడ్ల గోడౌన్‌ను పరిశీలిస్తున్న పీడీ పద్మజ

లక్కిరెడ్డిపల్లె, అక్టోబరు18: పిల్లలకు, గర్భిణులకు ఇస్తున్న కోడిగుడ్డు నాణ్యతతో అందించాలని జిల్లా శిశు సంక్షేమశాఖ అధికారి పద్మజ పేర్కొన్నారు. సోమవారం లక్కిరెడ్డిపల్లె ఐసీడీఎస్‌ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కోడిగుడ్లను ఆమె పరిశీలించారు. కోడిగుడ్డు సైజు ఉండాలని, చిన్నగుడ్లు ఇస్తే వాపస్‌ చేయాలన్నారు. ఉదయం 8 గంటలకే అంగన్వాడీ సెంటర్‌ తెరవాలని, ప్రభుత్వం అందిస్తున్న బాలామృతం, కోడిగుడ్లు పిల్లలకు సకాలంలో అందేటట్లు చూడాలన్నారు. అలాగే సూపర్‌వైజర్లు అంగన్వాడీ సెంటర్‌ను పర్యవేక్షణ చేసి పౌష్టికాహారం సక్రమంగా అందుతుందా లేదా అన్న విషయాలపై ఆరా తీయాలన్నారు.కార్యక్రమంలో సీడీపీవో పద్మావతి, సూపర్‌వైజర్‌ అరుణదేవి, తులశమ్మ, ప్రాజెక్టు అధ్యక్షురాలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T04:54:13+05:30 IST