ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2020-02-20T06:35:54+05:30 IST

ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతిని పురస్కరించుకోని కోస్గి పట్టణంలో బుధవారం హిందూ ఏక్తా బైక్‌ర్యాలీ, శోభాయాత్ర విజయవంతంగా కొనసాగింది. రామాలయం చౌరస్తా

ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

కోస్గి రూరల్‌, ఫిబ్రవరి19: ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతిని పురస్కరించుకోని కోస్గి పట్టణంలో బుధవారం హిందూ ఏక్తా బైక్‌ర్యాలీ, శోభాయాత్ర విజయవంతంగా కొనసాగింది. రామాలయం చౌరస్తా నుంచి విజీ చౌరస్తా వరకు భారీ బైక్‌ర్యాలీ, శోభాయత్ర నిర్వహించారు. ఈ సందర్భగా ప్రదన వక్త రాకేష్‌ మట్లాడుతూ.. ముస్లిం రాజ పరిపాలనలో హిందువుల పట్ల నిరంకుశంగా మత మార్పిడి కొనసాగుతున్న సందర్భంగా హిందూ సామ్రాజ్య విస్తరణపై ఛత్రపతి శివాజీ చూపిన చోరువతో నేటి దేశం హిందూ దేశంగా కొనసాగుతుందన్నారు. తన తల్లి జీజీయ బాయి స్ఫూర్తితో హిందువుల ఐక్యత, విస్తరణ కోసం బీకర మైన యుద్ధాలు చేసి ముస్లింల రాజుల నుంచి హిందు వులను కాపాడిన ఘనత శివాజీదే అన్నారు. ప్రస్తుతం దేశంలో ఉగ్రవాదం పెరిగిపోవడానికి దేశంలోని రాజకీయ పార్టీలలో ఐక్యత లేకపోవడమేనన్నారు. హిందూవులు శాంతి కాముకులని, శాంతి, సహనంతో ఉండటంతోనే పరా యి దేశస్థులు పెట్రేగిపోతున్నారని అన్నారు. పాకిస్థాన్‌ లాంటి దేశాలను ఉపేక్షిస్తే మన దేశానికే ప్రమాదమన్నారు. దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశియుల పట్ల మోదీ ప్రభుత్వం సీఎఎ, ఎన్‌పీఆర్‌, లాంటి నిబంధనలతో ముందుకు వచ్చిన తరుణంలో దేశంలోని కుహనలౌకిక వాదులు వ్యతిరేకించడం దేశ భద్రతకు ముప్పుగా పరిణ మిస్తుందన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంచలనే లక్ష్యంతో ప్రభుత్వం చేస్తున్న కృషికి దేశ పౌరు లందరూ మద్దతు ఇవ్వాలని అన్నారు. ప్రతి పౌరుడు ముం దుగా దేశ భద్రతకు పాటు పడుతూ దేశ హితం కోసం ముందు కెళ్లాలన్నారు. యువత చెడు మార్గంలో కాకుండా హిందూ సమాజం ఉద్దరణ కోసం పాటుపడుతూ,సంస్కృతి సాంప్రాదాయాలను గౌరవించాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐనాగరాజ్‌, బద్రీ, భరత్‌ గౌడ్‌, మల్లేష్‌,బెజ్జు రాంచేందర్‌, రాఘునాధ్‌ రెడ్డి, సురేష్‌ తదితరలు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T06:35:54+05:30 IST