చెరువు కాదు.. ఇది రహదారే!

ABN , First Publish Date - 2022-08-11T06:47:14+05:30 IST

మండల పరిధిలోని బీఎన్‌ రోడ్డులో ఇటు రావికమతం నుంచి అటు దొండపూడి ఠాణా వరకు దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర రహదారి పలుచోట్ల భారీ గోతులు ఏర్పడి పూర్తిగా ధ్వంసమైంది.

చెరువు కాదు.. ఇది రహదారే!
రావికమతం మండలం మేడివాడ వద్ద చెరువును తలపిస్తున్న గొయ్యి

- గోతులమయంగా రావికమతం మండలంలోని రోడ్లు

మండల పరిధిలోని బీఎన్‌ రోడ్డులో ఇటు రావికమతం నుంచి అటు దొండపూడి ఠాణా వరకు దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర రహదారి పలుచోట్ల భారీ గోతులు ఏర్పడి పూర్తిగా ధ్వంసమైంది. రావికమతం పెట్రోల్‌ బంకు, టి.అర్జాపురం-చిలకవానిపాలెం మఽధ్య, జి.చీడిపల్లి వద్ద, మేడివాడ-గర్నికం గ్రామాల వద్ద చెరువులను తలపించేలా గోతులు వున్నాయి. వర్షం కురిస్తే గోతుల్లో నుంచి ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నామని వాహన చోదకులు వాపోతున్నారు. రోడ్డు విస్తరణ అటుంచి.. ముందు గోతులు పూడ్చి ప్రమాదాలను నివారించాలని పలువురు కోరుతున్నారు.

- రావికమతం


Updated Date - 2022-08-11T06:47:14+05:30 IST