Abn logo
Jul 26 2021 @ 10:27AM

ఒకేరోజు 21 కిలోల గుట్కా స్వాధీనం..135 మంది అరెస్టు

చెన్నై/వేలూరు: రాణిపేట, తిరుపత్తూర్‌, వేలూరు జిల్లాల్లో శనివారం ఒకేరోజు పోలీసులు జరిపిన దాడుల్లో 21 కిలోల గుట్కా స్వాధీనం చేసుకొని 135 మందిని అరెస్టు చేశారు. వేలూరు జిల్లాలో 10 కిలోల గుట్కా, పాన్‌మసాలా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు 58 మందిని అరెస్టు చేశారు. అలాగే, రాణిపేటలో 60 మందిని అరెస్టు చేసి 6 కిలోల గుట్కా, తిరుపత్తూర్‌ జిల్లాలో 17 మందిని అరెస్టు చేసి 5 కిలోల గుట్కాను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

TAGS: chennai