‘ఇంటి వద్దకే విద్య’కు 1.3 లక్షల మంది దరఖాస్తు

ABN , First Publish Date - 2021-11-01T18:08:07+05:30 IST

ఇంటి వద్దకే విద్య’ పథక నమోదుకు స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు ఆసక్తి చూపుతున్నారని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ పథకంలో ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాలల

‘ఇంటి వద్దకే విద్య’కు 1.3 లక్షల మంది దరఖాస్తు

చెన్నై/పెరంబూర్‌: ‘ఇంటి వద్దకే విద్య’ పథక నమోదుకు స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు ఆసక్తి చూపుతున్నారని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ పథకంలో ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాలల ప్రారం భం లేదా ముగిసిన తర్వాత విద్యార్థుల ఇంటి వద్దకే వెళ్లి బోధించనున్నారు. ఇందుకోసం స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులను పాఠశాల విద్యాశాఖ ఎంపిక చేస్తోంది. ఈ పథకంలో పాఠాలు బోధించేందుకు ముందుకొచ్చిన వారు ఎలాంటి వేతనం అందించమని, ప్రోత్సాహక వేతనం మాత్రమే అందిస్తా మని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఇప్పటివరకు పాఠాలు బోధించేందుకు 1,03,548 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 81,442 మంది మహిళలు, 22,605 మంది పురుషులున్నారు. ఈ పథకం 12 జిల్లాల్లో ఆరు నెలలు ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటిం చిన విషయం తెలిసిందే.

ప్రత్యేక అధికారిగా ఇళమ్‌భగవత్‌ 

‘ఇంటి వద్దకే విద్య’ పథక ప్రత్యేకాధికారిగా కె.ఇళమ్‌భగవత్‌ నియమితు లయ్యారు. ఈ పథకం పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా తమిళనాడు నగరా భివృద్ధి సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహ రిస్తున్న ఐఏఎస్‌ అధికారి ఇళమ్‌భగవత్‌ నియమితులయ్యారు.

Updated Date - 2021-11-01T18:08:07+05:30 IST