Abn logo
Jul 19 2021 @ 12:43PM

Chennai: పాళయంకోట జైల్లో ఖైదీ మృతి

చెన్నై/ప్యారీస్: తిరునల్వేలి జిల్లా పాళయంకోటలో వున్న కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న కన్నియాకుమారి జిల్లాకు చెందిన ఖైదీ ఊపిరాడక మృతి చెందాడు. ఆర్ముగస్వామి కుమారుడు దురై (38) ఖర్చులకు డబ్బులు ఇవ్వని కారణంగా  2017లో  తండ్రిని దారుణంగా హత మార్చాడు. ఈ కేసులో నేసమణి నగర్‌ పోలీసులు దురైని అరెస్టు చేసి కోర్టుఉత్తర్వుల మేరకు పాళయంకోట జైలుకు తరలించారు. జైలులో దురై మానసికరోగిలా తయారయ్యాడు. జైలు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతు న్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున జైలు గదిలో వున్న దురైకి ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురవడంతో మెరుగైన చికిత్స కోసం పాళయంకోట ప్రభుత్వాసు పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స ఫలించక మరణించినట్లు పోలీసులు తెలిపారు.