సరిహద్దు చెక్‌ పోస్టు వద్ద తనిఖీలు ముమ్మరం

ABN , First Publish Date - 2020-07-03T10:43:49+05:30 IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగటంతో ఆంధ్రా-తెలంగాణ రాష్ట సరిహద్దు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు.

సరిహద్దు చెక్‌ పోస్టు వద్ద తనిఖీలు ముమ్మరం

జీలుగుమిల్లి, జూలై 2: రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగటంతో ఆంధ్రా-తెలంగాణ రాష్ట సరిహద్దు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాల ప్రకారం. రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకు అనుమతులు లేని వాహనాలు రాకుండా అడ్డుకుంటున్నారు.  ఈపాస్‌ ఉంటేనే తెంగాణ నుంచి ఆంధ్రాకు వాహనాల్ని అనుమతిస్తున్నారు. దీంతోపాటు గురువారం పలు నిఘా విభాగాల పోలీస్‌ శాఖ సిబ్బందితో కలసి రహదారిపై వెళ్లే వాహనాల పరిస్థితి, అక్రమ మద్యం, నగదు రవాణాపై నిఘా ఉంచారు. తనిఖీల్లో ఏఎస్‌ఐ శ్రీనివాస్‌, హెడ్‌కానిస్టేబుల్‌ సత్యానందం, దుర్గారావు, ఎస్‌బీఐ, ఇంటిలిజెన్స్‌ నిఘా సిబ్బంది ఎఆర్‌ కానిస్టేబుల్స్‌ ఉన్నారు. 

Updated Date - 2020-07-03T10:43:49+05:30 IST