డబుల్‌ వెరిఫికేషన్‌తో హ్యాకర్లకు చెక్‌

ABN , First Publish Date - 2022-06-11T05:44:03+05:30 IST

వాట్సాప్‌ డబుల్‌ వెరిఫికేషన్‌ ఫీచర్‌ను తీసుకువస్తోంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్‌లో ఉన్నట్టు సమాచారం.

డబుల్‌ వెరిఫికేషన్‌తో హ్యాకర్లకు చెక్‌

వాట్సాప్‌ డబుల్‌ వెరిఫికేషన్‌ ఫీచర్‌ను తీసుకువస్తోంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్‌లో ఉన్నట్టు సమాచారం. పాపులర్‌ మెసేజింగ్‌ యాప్‌ కావడంతో స్కామర్లు, హ్యాకర్లకు వాట్సాప్‌ టార్గెట్‌ అవుతోంది. టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ ఉన్నప్పటికీ హ్యాకింగ్‌కు గురవుతోంది. అందుకే అదనంగా మరో స్థాయి ప్రొటెక్షన్‌కు వాట్సాప్‌ కృషి చేస్తున్నట్టు ‘డబ్ల్యుఎబేటాఇన్ఫో’ గుర్తించింది. బేటా టెస్టర్లకు రిలీజ్‌ చేసిన తరవాత ఇంకో డివైస్‌ నుంచి అసలు దానిలోకి రావాలంటే అదనంగా వెరిఫికేషన్‌ కోడ్‌తో కన్‌ఫర్మ్‌ కావాల్సి ఉంటుంది. అందుకుగాను ఆరంకెల కోడ్‌  ఉండొచ్చు. 


వినియోగదారులు మొదటి యత్నంలో వాట్సాప్‌ అకౌంట్‌లోకి వెళ్ళినప్పుడు ఫోన్‌ అసలు ఓనర్‌కు ఆరు అంకెల కోడ్‌ పంపాల్సి ఉంటుంది. అంటే ఓనర్‌కి అలర్ట్‌ నోటిఫికేషన్‌ వచ్చినట్టే. ఇంకో డివైస్‌ నుంచి లాగాన్‌ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అదే ఆథరైజ్డ్‌ కాని పక్షంలో నిరోధిస్తుంది. ఈ తరహాలో మరికొన్ని ఫీచర్లపై వాట్సాప్‌ పనిచేస్తోందని సమాచారం. 

Updated Date - 2022-06-11T05:44:03+05:30 IST