శిక్షణ పేరుతో చీటింగ్‌!

ABN , First Publish Date - 2021-06-18T05:46:27+05:30 IST

శిక్షణ పేరుతో చీటింగ్‌ చేశారు. ఉచి తంగా కుట్టుమిషన్లు ఇప్పిస్తామని చెప్పి పేర్లు నమోదు చేసుకున్న త ర్వాత డబ్బులు వసూలు చేసి పరారయ్యారు. ఈ సంఘటన నిజామాబాద్‌ మండలం మేజర్‌ గ్రామ పంచాయతీ గుండారంలో జరిగింది. వివరా లు ఇలా ఉన్నాయి.. గ్రామ సర్పంచ్‌ను, పంచాయతీ కార్యదర్శిని ‘జీవన జ్యోతి చారిటబుల్‌ సొసైటీ సర్వీస్‌ ట్రస్టు’ నిర్వాహకులు కలిసి తమ సంస్థ కార్యకలాపాలు లాప్‌టాప్‌లో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో మహిళలకు అందిస్తున్న చేయూతలు, ఫొటోలు, అవార్డులు లాప్‌టాప్‌లో చూపించారు.

శిక్షణ పేరుతో చీటింగ్‌!
టైలరింగ్‌ పేరుతో రూ.లక్ష వరకు వసూలు శిక్షణ తర్వాత ఉష మిషన్‌ ఇస్తానని ఆశలు ఒక్కొక్కరి వద్ద రూ.4,500 వరకు.. గుండారం గ్రామ పంచాయతీపైనే శిక్షణ కేంద్రం

టైలరింగ్‌ పేరుతో రూ.లక్ష వరకు వసూలు
శిక్షణ తర్వాత ఉష మిషన్‌ ఇస్తానని ఆశలు
ఒక్కొక్కరి వద్ద రూ.4,500 వరకు..


నిజామాబాద్‌ రూరల్‌, జూన్‌ 17: శిక్షణ పేరుతో చీటింగ్‌ చేశారు. ఉచి తంగా కుట్టుమిషన్లు ఇప్పిస్తామని చెప్పి పేర్లు నమోదు చేసుకున్న త ర్వాత డబ్బులు వసూలు చేసి పరారయ్యారు. ఈ సంఘటన నిజామాబాద్‌ మండలం మేజర్‌ గ్రామ పంచాయతీ గుండారంలో జరిగింది. వివరా లు ఇలా ఉన్నాయి.. గ్రామ సర్పంచ్‌ను, పంచాయతీ కార్యదర్శిని ‘జీవన జ్యోతి చారిటబుల్‌ సొసైటీ సర్వీస్‌ ట్రస్టు’ నిర్వాహకులు కలిసి తమ సంస్థ కార్యకలాపాలు లాప్‌టాప్‌లో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో మహిళలకు అందిస్తున్న చేయూతలు, ఫొటోలు, అవార్డులు లాప్‌టాప్‌లో చూపించారు. దీంతో గ్రామపాలకులు ఫిదా అయిపోయి ఓకే అని గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. పంచాయతీ భవనం పైనే ఉచితంగా పెద్ద హాలును శిక్షణకేంద్రానికి ఇచ్చారు. గ్రామంలోని మహిళలు కుట్టుమిషన్‌, ఎంబ్రయిడరీలో చేరితే వారికి జాబ్‌ ఇప్పిస్తామని, జేఎన్టీయూ నుంచి సర్టిఫికెట్‌ ఇస్తామని ఆశ చూపించారు. దాంతో చాలా మంది మహిళలు మందుకు వచ్చారు. మొదటి బ్యాచ్‌లో 22 మంది మహిళలు చేరారు. వారికి శిక్షణ ఇచ్చేందుకు ఓ ట్రైనర్‌ను నియమించారు. (ఆమెకు రూ.10,000 వేతనం ఇస్తానని ఆశ చూపి జీతం ఇవ్వకపోవడంతో మానివేసింది). శిక్షణ ప్రారంభమైన వారం నుంచే డబ్బులు అడగసాగారు. మొదట రూ.500 నుంచి ప్రారంభించి మొత్తం ఒక్కో మహిళ వద్ద రూ.4,500 వసూలు చేశారు. శిక్షణ పూర్తవగానే ఉష కంపెనీ కుట్టుమిషన్‌ అందజేస్తామని, కలెక్టర్‌నుంచి సర్టిఫికెట్‌ ఇప్పిస్తామని నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన మహిళలు డబ్బులు సమర్పించుకున్నారు. నెలరోజులకే బిచాణా ఎత్తేశారు. మహిళలు కూడా ఎవరికీ చెప్పుకోలేక, ఏమీ చేయలేక మిన్నండిపోయారు. ఈ తతంగం మండలంలోని పలు గ్రామాల్లో ప్రయత్నించారు. కానీ గ్రామ పెద్దలు సహకరించకపోవడంతో వారి ఎత్తులు పారలేదు. ప్రతీ జిల్లాలో తమ కార్యాలాయలున్నాయని నమ్మబలికారు. మండలాల వారీగా కో- ఆర్డినేటర్లను నియమించుకున్నారు. మూడు నెలలుగా హడావుడి లేకపోవంతో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లకు అనుమానం వచ్చి ఆరా తీయడంతో మోసం  బయటపడింది. వారు ఇచ్చిన ఫోన్‌ నెంబర్లకు చేయడంతో హిందీలో మాట్లాడటం, తర్వాత స్విచ్‌ఆఫ్‌ రావడంతో మోసపోయినట్లు గ్రహించారు. రూరల్‌ సీఐ, ఎస్‌హెచ్‌వోకు సమాచారం అందించారు.
అప్పుచేసి డబ్బులు కట్టాను: లక్ష్మి, గుండారం
టైలరింగ్‌ మీద ఉన్న ఇష్టంతో రూ.5 వేలు అప్పుతెచ్చి కట్టాను. నెల రోజులు కూడా నేర్పలేదు. శిక్షణ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసపోయాను. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.

Updated Date - 2021-06-18T05:46:27+05:30 IST