సరిహద్దు దాటుతున్న చౌక బియ్యం

ABN , First Publish Date - 2021-05-17T05:23:58+05:30 IST

ప్రభుత్వం పేదలకు ఇస్తున్న రేషన బియ్యాన్ని కొందరు వ్యాపారులు పక్కదారి పట్టిస్తున్నారు. పేదల బియ్యంతో అక్రమ వ్యాపారం చేసి రూ.లక్షలకు పడగలెత్తుతున్నారు.

సరిహద్దు దాటుతున్న చౌక బియ్యం
ఇటీవల పట్టుబడిన చౌకబియ్యం వాహనం (ఫైల్‌ ఫొటో)

తూతూమంత్రంగా అధికారుల దాడులు


బొమ్మనహాళ్‌, మే 16 : ప్రభుత్వం పేదలకు ఇస్తున్న రేషన బియ్యాన్ని కొందరు వ్యాపారులు పక్కదారి పట్టిస్తున్నారు. పేదల బియ్యంతో అక్రమ వ్యాపారం చేసి రూ.లక్షలకు పడగలెత్తుతున్నారు. ఈ మాఫియా దందా  మండలంలో యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వం లబ్ధిదారులకు ఒక్క రూ పాయికే కిలో బియ్యం అందజేస్తోంది. అయితే కొందరు అక్రమార్కులు ఈ బియ్యాన్ని కర్ణాటక ప్రాంతానికి ఎగుమతి చేస్తూ చీకటిదందా నడిపిస్తున్నా రు. ఎక్కువ మంది సన్నబియ్యం తినేందుకు ఇష్టపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే సన్నబియ్యంను తీసుకుని వండుకోకుండా అమ్మేస్తున్నారు. కొనేందు కు గ్రామాలకు వ్యాపారులు వస్తున్నారు. వారు కిలోకు రూ.పది నుంచి రూ.12ల వరకు లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేస్తారు. అమ్మినవారికి కిలో కు  రూ.పది నుంచి రూ.11 వరకు లాభం వస్తోంది. మండలంలో చౌకబి య్యం అక్రమ వ్యాపారం నిత్యకృత్యమైంది.


మండలంలో ఒక పక్క అధికారులు దాడులు నిర్వహిస్తున్నా.. చీకటి వ్యాపారం ఆగడం లేదు. అయితే సంబంధిత అధికారులు బలహీనులపైనే టార్గెట్‌ చేసి బలవంతులపై ఎ లాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గ్రా మాలలో సేకరించిన బియ్యాన్ని కర్ణాటకలోని తుమకూరు, దావణగెరె, బెం గళూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏప్రిల్‌ నెలలో కర్ణాటక ప్రాంతాలకు తరలిస్తూ ఎల్‌బీనగర్‌ గ్రామం వద్ద అధికారులు పట్టుకున్నారు. అదేవిధం గా కణేకల్లు క్రాస్‌ వద్ద కూడా పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పజెప్పా రు. అడపాదడపా దాడులతోనే ఇలా పట్టుబడుతుంటే.. వ్యాపారం ఏ స్థా యిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ చీకటి వ్యాపారం కొందరు నే తల అండదండలతోనే కొనసాగుతోందని తెలుస్తోంది. కొనుగోలు చేసిన బి య్యాన్ని అక్రమార్కులు మండలంలోనే బొల్లనగుడ్డం, బండూరు, గోవిందవాడ క్రాస్‌ గ్రామ శివార్లలో నిల్వ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం జన సంచారం తక్కువగా వుండే ప్రాంతాల్లోనే ఖాళీ స్థలాల్లో నిల్వ చేస్తున్న ట్లు తెలుస్తోంది. అక్రమ నిల్వల తరలింపుపై ఎవరైనా అధికారులకు సమాచారం ఇస్తే రెవెన్యూ, సివిల్‌ సప్లై అధికారులు నిఘా పెట్టి పట్టుకుంటున్న సందర్భాలు లేవనే చెప్పాలి. 


పూర్తి నిఘా ఉంచుతున్నాం

 సావిత్రి, సీఎ్‌సడీటీ, బొమ్మనహాళ్‌

చౌకబియ్యం అక్రమంగా తరలిస్తున్న దళారులపై చర్యలు చేపడుతు న్నాం. స్థానిక పోలీసుల సహాయం తీసుకుని రాత్రి సమయాల్లో కూడా గట్టి నిఘాను ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం మంచి ఆశయంతో చేపట్టిన బి య్యం పథకాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలే గానీ అమ్ముకోకూడదు. వినియోగించుకుంటే ఈ అక్రమ వ్యాపారం తగ్గడానికి అవకాశం కలుగుతుంది. 

Updated Date - 2021-05-17T05:23:58+05:30 IST