Abn logo
Sep 17 2021 @ 22:25PM

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

మాట్లాడుతున్న ఏడవ అదనపు జిల్లా జడ్జి రమణయ్య

గూడూరు, సెప్టెంబరు 17: ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఏడవ అదనపు జిల్లా జడ్జి రమణయ్య అన్నారు. శుక్రవారం చెన్నూరులో మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కేసులను త్వరితగతిన పరిష్కరించునేందుకు లోక్‌అదాలత్‌ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. గ్రామీణులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జానీబాషా, అశోక్‌కుమార్‌, న్యాయవాదులు, వివిధశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.