అన్ని దానాల్ల్లో అన్నదానం చాలా గొప్పది

ABN , First Publish Date - 2022-08-14T05:01:15+05:30 IST

అన్ని దానాల్లో కెల్లా అన్నదానం చాలా గొప్పదని తెలుగుదేశం పార్టీ నియోజకర్గ నాయకుడు, టీటీడీ పాలకవర్గ మాజీ సభ్యుడు సుగవాసి ప్రసాద్‌బాబు అన్నారు.

అన్ని దానాల్ల్లో అన్నదానం చాలా గొప్పది
అన్నదానం చేస్తున్న సుగవాసి ప్రసాద్‌బాబు

రాయచోటిటౌన్‌, ఆగస్టు 13: అన్ని దానాల్లో కెల్లా అన్నదానం చాలా గొప్పదని తెలుగుదేశం పార్టీ నియోజకర్గ నాయకుడు, టీటీడీ పాలకవర్గ మాజీ సభ్యుడు సుగవాసి ప్రసాద్‌బాబు అన్నారు. శ్రావణమాసం 3వ శనివారం సందర్భంగా మాండవ్యనది ఒడ్డున ఉన్న ప్రసన్నాంజ నేయస్వామి ఆలయంలో టీడీపీ సీనియర్‌ నాయకుడు మన్నేరు రామాంజనేయులు దాతృత్వంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.  ప్రసన్నాంజ నేయస్వామి ఆలయంలో  పూజలు నిర్వహించారు. సుగవాసి శ్రీనివాసులు, లాయర్‌ సతీష్‌రెడ్డి, ఎస్‌పీ రాయుడు, సుగవాసి శ్యాంకుమార్‌, బడిశెట్టి రవికుమార్‌, ప్రవీణ్‌రాజు, కటారు శివప్రసాద్‌, మన్నేరు రాజా, మన్నేరు శేఖర్‌, కొట్టే శేఖర్‌, హెల్మెట్‌ నిసార్‌, కేసీ ప్రసాద్‌, ఏనుగుల విశ్వనాధ, పసుపులేటి నాగేంద్ర, రాజశేఖర్‌  పాల్గొన్నారు.

గాలివీడు: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కలిసి మెలిసి ఉండేందుకే ఆలయాల నిర్మించారని టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు ప్రసాద్‌బాబు తెలిపారు. శనివారం తూముకుంట గ్రామం బలిజపల్లెలో సీతారామ లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిషిం చారు. ఈ సందర్భంగా ఆయన పూజలు చేశారు. అనంతరం ఆయన దిగువమూలలోని పెద్దగొడుగు స్వామిని దర్శించారు. ప్రసాద్‌ బాబును గ్రామస్థులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య, సర్పంచ్‌ రవికుమార్‌ నాయుడు, మాజీ సర్పంచులు భద్రప్ప, చిన్నపరెడ్డి, స్థానిక నాయకులు వెంకటాద్రి, కదిరినాయుడు పాల్గొన్నారు. 

చిన్నమండెం:  కేశాపురం గ్రామం తుమ్మలగుంట క్రాస్‌ వద్ద ఉన్న గుట్టమోటు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద గోవిందు, చిన్న గంగన్న, ధర్మాపతి గోవింద పాపులమ్మ జ్ఞాపకార్థం కుమారుడు గోవిందు, సుధాకర్‌, రమాదేవి నిర్మించిన కల్యాణ మండపాన్ని రాయచోటి టీడీపీ నాయకుడు సుగవాసి ప్రసాద్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఎలాంటి రుసుమూ లేకుండా వివాహాలు చేసుకునేందుకు కల్యాణ మండపాన్ని నిర్మించడం హర్షణీయమన్నారు.  ఈ కార్యక్రమంలో లాయర్‌ సతీష్‌రెడ్డి, సుగవాసి శ్రీనివాసులు, తౌహీద్‌ఖాన్‌, శంకర, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T05:01:15+05:30 IST