పద్ధతి మార్చుకోండి

ABN , First Publish Date - 2022-08-11T05:52:20+05:30 IST

పద్ధతి మార్చుకోండి

పద్ధతి మార్చుకోండి
పార్వతీపురం: మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న విజయప్రతాప్‌రెడ్డి

- రాష్ట్ర ఆహార కమిషన్‌ చైర్మన్‌ విజయప్రతాప్‌రెడ్డి

పార్వతీపురం-ఆంధ్రజ్యోతి/ సీతంపేట/ దత్తిరాజేరు: వసతి గృహాల్లో వార్డెన్లు రాత్రి పూట పిల్లలు భోజనాలు చేసేవరకైనా ఉండడం లేదని, పద్ధతి మార్చుకోవాలని రాష్ట్ర ఆహార కమిషన్‌ చైర్మన్‌ సీహెచ్‌ విజయప్రతాప్‌రెడ్డి సూచించారు. బుధవారం పార్వతీపురం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఇకపై ఎండీఎం వాహనాల ద్వారా నేరుగా పాఠశాలలకే అందించనున్నట్లు చెప్పారు. ఎక్కడైనా లోపాలు ఉంటే టోల్‌ ఫ్రీ నెంబర్‌ 155235, అదేవిధంగా వాట్సాప్‌ నెంబర్‌ 95905 51117కు సమాచారాన్ని అందించాలని సూచించారు. ఫిర్యాదులు, పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారణ జరిపి నివేదికలను పంపించాలని ఉప సంచాలకులు డి.సురేష్‌ ఆదేశించారు. అనంతరం పట్టణంలో ప్రైమరీ స్కూల్‌, మున్సిపల్‌ మెమోరియల్‌ స్కూల్‌, గరుగుబిల్లి మండలం నాగూరు జడ్పీ హైస్కూల్‌ను సందర్శించారు. ఆయా చోట్ల మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. అధికారులు ఎండీ నాయక్‌, మధుసూదనరావు, బ్రహ్మాజీరావు, కిరణ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 

- సీతంపేట గిరిజన బాలికల గురుకుల రెసిడెన్షియల్‌ పాఠశాలలో మెనూ, జీసీసీ సరుకుల నాణ్యత, డీఆర్‌ డిపో, సివిల్‌ సప్లై గోదాము, స్టాక్‌ పాయింట్లు, ఎండీఎం వాహనాలను పరిశీలించారు. 

- దత్తిరాజేరు మండలం మానాపురం రేషన్‌ డిపోను ఆకస్మికంగా తనిఖీ చేసి రేషన్‌ నిల్వ, ధరల పట్టిక, తూనిక యంత్రాలను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సరుకుల పంపిణీపై ఆరా తీశారు. 

Updated Date - 2022-08-11T05:52:20+05:30 IST