చండూరును రెవెన్యూ డివిజనగా ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-08-07T06:22:00+05:30 IST

మర్రిగూడ, నాంపల్లి, మునుగోడు, గుర్రంపోడు, కొత్తగా ఏర్పడిన గట్టుప్ప ల మండలాలను కలుపుకుని చండూరును రెవె న్యూ డివిజనగా ఏర్పాటు చేయాలని మండల సభ తీర్మానించింది.

చండూరును రెవెన్యూ డివిజనగా ఏర్పాటు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ప్రజాప్రతినిధులు

చండూరు, ఆగస్టు 6: మర్రిగూడ, నాంపల్లి, మునుగోడు, గుర్రంపోడు, కొత్తగా ఏర్పడిన గట్టుప్ప ల మండలాలను కలుపుకుని చండూరును రెవె న్యూ డివిజనగా ఏర్పాటు చేయాలని మండల సభ తీర్మానించింది. శనివారం ఎంపీపీ పల్లె కల్యాణి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ కల్యాణి పనితీ రు బాగాలేదని, అధికారులు ఎవరి మాటలు వినడం లేదని, ఏ శాఖ మీద ఎంపీపీకి పట్టు లేదని పలువురు సభ్యులు తీవ్రంగా అసంతృప్తి వ్య క్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సభ్యులు చేసే విమర్శల్లో వాస్తవం లేదన్నారు. గట్టుప్పల పశుసంవర్ధక శాఖ వైద్యుడి పనితీరు సరిగా లే దని అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించా రు. పలు సమస్యలపై చర్చించారు. సమావేశంలో జడ్పీటీసీ వెంకటేశం, వైస్‌ ఎం పీపీ నర్సింహారెడ్డి, ఎంపీడీవో జానయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-07T06:22:00+05:30 IST