Abn logo
Jul 11 2020 @ 04:29AM

వైవీయూ సీడీసీ డీన్‌గా చంద్రమతి శంకర్‌

కడప (వైవీయూ), జూలై 10: యోగివేమన విశ్వవిద్యాలయం కళాశాల డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌ సీడీసీ డీన్‌గా ప్రొఫెసర్‌ చంద్రమతి శంకర్‌, అసోసియేట్‌ డీన్‌గా డాక్టర్‌ ఎన్‌.ఈశ్వర్‌రెడ్డిలను నియమిస్తూ వీసీ సూర్యకళావతి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెసర్‌ చంద్రమతి శంకర్‌ బయో టెక్నాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. డాక్టర్‌ ఎన్‌.ఈశ్వర్‌రెడ్డి తెలుగు శాఖలో పనిచేస్తున్నారు. ప్రొఫెసర్‌ నజీర్‌ అహ్మద్‌ పదవీ కాలం పూర్తికావడంతో ఆ స్థానంలో వీరిని నియమించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ విజయరాఘవప్రసాద్‌, ప్రొఫెసర్‌ నజీర్‌ అహ్మద్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త మధుసూదన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


ఐక్యూఏసీ సభ్యులుగా అయిదుగురు 

వైవీయూ ఇంటర్నల్‌ క్వాలిటీ ఆస్యూరెన్స్‌ సెల్‌ (ఐక్యూఏసీ) సభ్యులుగా డాక్టర్లు సుదర్శన్‌రెడ్డి, మాధవి, రవిబాబు, సుభో్‌సచంద్ర, శివప్రతా్‌పలను వీసీ సూర్యకళావతి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సాంబశివారెడ్డి, రిజిస్ట్రార్‌ విజయరాఘవప్రసాద్‌, అధ్యాపకులు దాము, నజీర్‌ అహ్మద్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ రఘునాథరెడ్డి, డాక్టర్‌ గోవర్ధన్‌నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement