పరిటాల సునీతకు చంద్రబాబు శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2020-05-29T10:15:15+05:30 IST

మాజీ మంత్రి పరిటాల సునీత పుట్టినరోజు సందర్భంగా గురువారం ఉదయం ఆమెకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్‌ ..

పరిటాల సునీతకు చంద్రబాబు శుభాకాంక్షలు

అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు 


రామగిరి, మే28: మాజీ మంత్రి పరిటాల సునీత పుట్టినరోజు సందర్భంగా గురువారం ఉదయం ఆమెకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్‌ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి, ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించాలని ఆయన ఆశీర్వదించారు. క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్‌ గురించి ఆరాతీశారు. కరోనా వైర్‌సతో లాక్‌డౌన్‌ నేపథ్యంలో తాము వెంకటాపురంలో నే ఉంటూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యామని చంద్రబాబుకు ఆమె వివరించగా.. చంద్రబాబు అభినందించారు.


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. వెంకటాపురం గ్రామంలో పరిటాల సునీత వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరోనా ప్ర భావంతో జాగ్రత్తలు పాటిస్తూ వేడుకలు చేసుకున్నారు. ఆమె తండ్రి ధర్మవరపు కొండన్న ప్రత్యేకంగా 50కిలోల కేక్‌ తయారు చేయించి, అట్టహాసంగా నిర్వహించారు. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలతోపాటు జిల్లా నుంచి పలు ప్రాంతాల నుంచి అభిమానులు తరలివచ్చి, ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పరిటాల శ్రీరామ్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు, అభిమానులు వేడుకల్లో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - 2020-05-29T10:15:15+05:30 IST