Abn logo
Oct 23 2021 @ 00:45AM

చంద్రబాబు దీక్షకు స్థానిక నేతల మద్దతు

పుట్టపర్తి, అక్టోబరు 22: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన 36గంటల దీక్షకు మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి మద్దతు తెలి పారు. శుక్రవారం ఆయన స్థానిక నాయకులు సామకోటి ఆదినారాయణ, గూడూరు ఓబులేశు, దారపనేని చంద్రశేఖర్‌, బేకరినాయుడు, ఆవులసుబ్రమణ్యం పాటు పలువురు బాబుదీక్షలో పాల్గొన్నారు. 

ధర్మవరం: తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యాలయం, టీడీపీ నేతల ఇళ్లపై వైసీపీ అల్లరిమూకల దాడికి వ్యతిరేకంగా ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36గంటల దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు నియోజకవర్గం నుండి టీడీపీ నాయకులు రాంపురంశీన, గశికవారిపల్లి నాగార్జునలు చంద్రబాబు నాయుడును కలిసి మద్దతు తెలిపారు.