Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 30 Jun 2022 15:52:20 IST

Balmuri Venkatను అరెస్టు చేయడం అప్రజాస్వామికం: Chandana Reddy

twitter-iconwatsapp-iconfb-icon

సిద్దిపేట (Siddipet) జిల్లా: బల్మూరి వెంకట్ (Balmuri Venkat) అరెస్ట్‌ను ఎన్ఎస్‌యూఐ (NSUI) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చందనా రెడ్డి (Chandana Reddy) ఖండించారు. గురువారం ఆమె సిద్దిపేట పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిన్న బల్మూరి వెంకట్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. మంత్రి హరీష్ రావు (Harish Rao) నియోజక వర్గంలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. మంత్రిపై ఉన్న నమ్మకంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపిస్తే విద్యార్థులను చులకన భావంతో చూస్తున్నారన్నారు. తెలంగాణలో దౌర్జన్య పాలన నడుస్తుందని, అరెస్టులతో మీరు చేసే అన్యాయాలను ఆపలేరన్నారు. తాము రౌడీలం కాదని, విద్యార్థి నాయకులమని, విద్యార్థులకు, తల్లిదండ్రులకు అండగా ఉంటామని చందనా రెడ్డి స్పష్టం చేశారు.


సిద్దిపేటలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ఇటీవల కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురైన విద్యార్థినులను పరామర్శించేందుకు వెళ్తున్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసింది. వెంకట్‌ను బలవంతంగా ఆయన వాహనంలో నుంచి దించి అరెస్టు చేసి తొగుట పోలీసుస్టేషనుకు తరలించారు. అయితే వెంకట్‌ అస్వస్థకు గురికావడంతో గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌కు తరలించారు. వెంకట్‌ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు చిన్నకోడూరు పోలీసు స్టేషను ఎదుట సిద్దిపేట-ఇల్లంతకుంట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాగా వెంకట్‌ మెడ భాగంలో గాయం అయినట్టు తెలుస్తోంది. వెంకట్‌ను సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి  పరామర్శించారు. పోలీసులు ప్రవర్తించిన తీరును జగ్గారెడ్డి తీవ్రంగా ఖండించారు. కాగా వెంకట్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తీవ్రంగా ఖండి ంచారు. వెంకట్‌ అరె్‌స్టపై సిద్దిపేట కమిషనర్‌తో రేవంత్‌ ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైనవారిని పరామర్శించేందుకు వెళ్తున్న విద్యార్థి నాయకుడిని అడ్డుకోవడం టీఆర్‌ఎస్‌ పాలకుల పాశవిక చర్య అని రేవంత్‌ మండిపడ్డారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.