Chanakya Neeti: విజయంతో పాటు సంపద కోరుకునేవారు ఈ 4 లోపాలను తొలగించుకోవాలి!

ABN , First Publish Date - 2022-07-31T12:26:54+05:30 IST

శతాబ్దాల క్రితం ఆచార్య చాణక్యుడు రచించిన...

Chanakya Neeti: విజయంతో పాటు సంపద కోరుకునేవారు ఈ 4 లోపాలను తొలగించుకోవాలి!

శతాబ్దాల క్రితం ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం నేటి ఆధునిక కాలంలోనూ ఎంతగానో ఉపయోగపడుతోంది. దీనికి అతిపెద్ద కారణం దీనిలో చెప్పిన జీవిత సత్యాలు. జీవితాన్ని సులభతరం చేసే మార్గాలను అనుసరించడం ద్వారా విజయ సాధన సులభమవుతుంది. ఇటువంటి సూత్రాలు ఉన్నకారణంగానే చాలామంది చాణక్య నీతిని అనుసరిస్తూ జీవితాన్ని విజయవంతం చేసుకుంటున్నారు. చాణక్య నీతి ప్రకారం దోషాలు, లోపాలు లేని వ్యక్తి మాత్రమే విజయాన్ని, సంపదను పొందగలుగుతాడు. అబద్ధాలు చెప్పడం, అహంకారం, దురాశ, మోసం తదితర లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి ఎప్పటికీ విజయం సాధించలేడు. సంపదను కూడా పొందలేడు.


బలహీనులను అణచివేయడం

తమ పదవిని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ బలహీనులను వేధిస్తూ, అవమానించే వారు లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కారని ఆచార్య చాణక్య తెలిపారు.  అలాంటి వారికి సమాజంలో గౌరవం కూడా లభించదు.

అత్యాశ

ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం కొంతమంది అత్యాశపరులు తమలోని అవలక్షణం కారణంగా జీవితాన్ని నాశనం చేసుకుంటారు. మోసం చేసి సంపాదించిన డబ్బు ఎప్పుడూ అక్కరకు రాదు. వృథా అవుతుంది. కష్టపడి సంపాదించిన డబ్బు ఎంతో విలువైనది.

మోసం

ఇతరులను మోసం చేస్తూ అభివృద్ధి చెందాలని ప్రయత్నించేవారు జీవితంలో ఒంటరిగా మిగిలిపోతారని ఆచార్య చాణక్యుడు చెప్పారు. అలాంటి వారికి విజయం లేదా సంపద లభించదు. వారి జీవితమంతా నరకమే. అలాంటి వారికి దూరంగా ఉండాలని చాణక్య సూచించారు.

అహంకారం

చాణక్య నీతి ప్రకారం అహంకారం అనేది మనిషికి ఉండే అతిపెద్ద లోపం. ఈ లోపం కలిగినవారు తమను తాము నాశనం చేసుకుంటారు. ఇలాంటివారు కొద్దికాలంలోనే తమ సంపదను, ప్రతిష్టను కోల్పోతారు. అలాంటి వారికి సమాజంలో గౌరవం లభించదు. 

Updated Date - 2022-07-31T12:26:54+05:30 IST