చాముండి కొండలపై మరోసారి కుంగిన భూమి

ABN , First Publish Date - 2021-11-19T18:12:25+05:30 IST

మైసూరులోని ప్రతిష్టాత్మక ఆలయం కలిగిన చాముండేశ్వరీ దేవి కొండలపై గురువారం మరోసారి భూమి కుంగిపోయింది. నెలరోజుల వ్యవధి లో భూమి కుంగిపోవడం ఇది నాలుగోసారి. చాముండి కొండల్లోని నంది మార్గంలో

చాముండి కొండలపై మరోసారి కుంగిన భూమి

బెంగళూరు: మైసూరులోని ప్రతిష్టాత్మక ఆలయం కలిగిన చాముండేశ్వరీ దేవి కొండలపై గురువారం మరోసారి భూమి కుంగిపోయింది. నెలరోజుల వ్యవధి లో భూమి కుంగిపోవడం ఇది నాలుగోసారి. చాముండి కొండల్లోని నంది మార్గంలో గురువారం తెల్లవారు జామున రోడ్డు పూర్తిగా కొ ట్టుకుపోయింది. సుమారు నెలరోజులుగా వర్షాలు కురుస్తున్నందున కొండ ప్రాంతం నుంచి నీరు భారీగా పారుతోంది. దీంతో ఎక్కడ పడితే అక్కడ భూమి కుంగిపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబరు రెండోవారం నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నవంబరు ప్రారంభం నుంచి ఏమాత్రం ఎడతెరిపి లేకుండా వర్షం హోరెత్తిస్తోంది. మరోనాలుగైదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీచేస్తుండటంతో మైసూరు ప్రాంత వాసులు బెంబేలెత్తుతున్నారు. ఏకంగా 70అడుగుల మేరన ప్రాంతం రోడ్డుకు అడ్డంగా ఉండే గోడ దాదాపు కుంగిపోయింది. ప్రజాపనులు శాఖామంత్రి సీసీ పాటిల్‌ జియోట్రయల్‌ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చాముండి కొండలను పరిశీలించి నిర్మాణాలు చేపట్టదలచారు. ఓ వైపు నిర్మాణాలు జరపాలని భావిస్తున్నా వరుసగా వర్షాలు కురుస్తుండటంతో సమస్యగా మారింది. రోడ్డు కుంగిపోయిన ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు.

Updated Date - 2021-11-19T18:12:25+05:30 IST