చలో రాజ్‌భవన్‌ ఉద్రిక్తం

ABN , First Publish Date - 2022-05-15T06:19:33+05:30 IST

చలో రాజ్‌భవన్‌ ఉద్రిక్తం

చలో రాజ్‌భవన్‌ ఉద్రిక్తం
ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఈడ్చుకెళ్తున్న పోలీసులు

పోలీసులు, విద్యార్థి సంఘాల నేతల మధ్య వాగ్వాదం, తోపులాట

నేతల అరెస్టు, పోలీస్‌ స్టేషన్లకు తరలింపు 


ధర్నాచౌక్‌, మే 14 : రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను అరికట్టాలని, వైస్‌ చాన్సలర్‌ ఆనందరావును వెంటనే రీకాల్‌ చేయాలని, రాష్ట్రంలోని యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం పలు విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో రాజ్‌భవన్‌’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నాచౌక్‌ వద్ద నుంచి రాజ్‌భవన్‌కు బయల్దేరుతున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాయలసీమ యూనివర్సిటీలో నెల రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, డీఎస్‌ఎఫ్‌, బీడీఎస్‌ఎఫ్‌ నేతలు జాన్సన్‌బాబు, సుబ్బారావు, ప్రసన్నకుమార్‌, గనిరాజు, రాజశేఖర్‌, ఎ.రవిచంద్ర, మహేంద్ర, రమేష్‌ తదితరులు పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఉన్నారు.



Updated Date - 2022-05-15T06:19:33+05:30 IST