ఛలో హైదరాబాద్‌

ABN , First Publish Date - 2022-04-13T06:03:35+05:30 IST

విద్యుత్‌ కోత లు సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులపైన పడింది. కొవిడ్‌ మొదలైనప్పటి నుంచి వారు ఇంటి నుంచే పనులు చేస్తున్నారు. కొన్ని రోజు లుగా అప్రకటిత విద్యుత్‌ కోతల వల్ల ఇంటి వద్ద పనులు సాగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఛలో హైదరాబాద్‌

కరెంటు కోతల ఎఫెక్ట్‌

ఆఫీసులకు పిలవండంటూ కంపెనీలకు రిక్వెస్టులు

ఇప్పటికే పశ్చిమ, ఏలూరు జిల్లాల నుంచి పదుల సంఖ్యలో పయనం 


ఆకివీడు/చాట్రాయి/పాలకొల్లు, ఏప్రిల్‌ 12: విద్యుత్‌ కోత లు సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులపైన పడింది. కొవిడ్‌ మొదలైనప్పటి నుంచి వారు ఇంటి నుంచే పనులు చేస్తున్నారు. కొన్ని రోజు లుగా అప్రకటిత విద్యుత్‌ కోతల వల్ల ఇంటి వద్ద పనులు సాగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాన్ఫరెన్స్‌ మధ్యలో ఉండగా ఒక్కసారిగా కరెంట్‌ కట్‌ అవడంతో పనికి బ్రేక్‌ పడు తోంది. గంటల తరబడి విద్యుత్‌ ఉండకపోవటం వల్ల వర్క్‌ టార్గెట్‌ పూర్తి కాకపోవడంతో మేనేజ్‌మెంట్‌తో చీవాట్లు తిన డంతోపాటు జాబ్‌ నుండి తొలగిస్తామని హెచ్చరికలు వస్తు న్నాయని పలువురు వాపోతున్నారు. విద్యుత్‌ కోత వల్ల లాబ్‌ట్యాప్‌లు మొరాయించడం, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఫైబర్‌ నెట్‌లు ఆగి పోవటం, సెల్‌ఫోన్‌ నెట్‌ సపోర్ట్‌ చేయకపోవటంతో పనికి అంతరాయం ఏర్పడి తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామ ని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉద్యోగం చేసే పరిస్దితి లేక తప్పక హైదరాబాద్‌ వెళుతున్నామని అం టున్నారు. వెంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్లు విద్యుత్‌ కోతలు పలు కుటుంబాలకు తిప్పలు తెచ్చిందని వాపోతున్నారు. ‘ఈ సమస్య ఎప్పటికి మెరుగుప డుతుందో తెలియకపోవడంతో మమ్మల్ని ఆఫీసులకు పిల వండి. ఇంటి నుంచి పనులు చేయలేకపోతున్నాం’ అంటూ తమ కార్యాలయాలకు మెయిల్స్‌ పెడుతున్నారు. ఇప్పటికే కొందరు ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. చాట్రాయి మండలం నుంచి సుమారు 50 మంది వర్క్‌ ఫ్రం హోం ఉద్యోగులు హైదరాబాద్‌ వెళ్లిపోయి అద్దె రూములో ఉంటూ జాబ్‌ వర్కు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు చెందిన వేలాది మంది సాప్ట్‌ వేర్‌ ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం నిర్వహిస్తున్నారు. 

పది రోజులుగా జరుగుతోన్న అనధికారిక విద్యుత్‌ కోతల విషయం అందరికీ తెలిసిందే. ఏలూరు జిల్లాలో మాత్రం పెద్దగా విద్యుత్‌ కోతలు లేవంటూ ఆ శాఖాధికారులు పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. చాట్రాయి మండలంలో వెలుగుచూస్తోన్న ఈ ఘటనపై అధికారులు ఏం సమాధానం చెబుతారో !


సెల్‌ లైట్‌తో విధులు

నరసాపురం రూరల్‌, ఏప్రిల్‌ 12 : నిన్న మొన్నటి వరకు ఆస్పత్రులు.. ఇళ్లల్లో.. షాపుల్లో, సంక్షేమ హాస్టళ్లల్లో కరెంట్‌ కోతలు చూస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లోను విద్యుత్‌ కోతలు తప్పడం లేదు. గంటల తరబడి విద్యుత్‌ కోతలు విధించడంతో ఇన్వెర్టర్లు ఉన్నా.. చార్జింగ్‌ అయిపోతున్నాయి. ఈ  పరిస్థితి నరసాపురం మండల పరిషత్‌ కార్యాలయంలో నెలకొంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు విద్యుత్‌ లైన్ల మార్పు కారణంగా కోతలు విధించారు. కార్యాలయంలో ఉన్న ఇన్వెర్టర్ల చార్జింగ్‌ పూర్తిగా అయిపోయింది. కార్యాలయ సూపరింటెండెంట్‌ రాజు సెల్‌ఫోన్‌ లైట్‌ వేసుకుని విధులు నిర్వహించాల్సిన వచ్చింది. 


వచ్చేస్తామని చెప్పాం

హైదరాబాద్‌ జన్‌సమ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజ నీరుగా ఉద్యోగం చేస్తున్నా. కరోనా మహమ్మారి థర్డ్‌వేవ్‌తో సంస్థ యాజమాన్యం ఇంటికి వెళ్లి విధులు నిర్వహించమన్నారు. అయితే ఇటీవల కరెంటు కటింగ్‌ అధికంగా ఉండడంతో విధులకు ఆటంకం కలుగుతుండడంతో వచ్చేస్తామని తెలిపాం.

– వాడపల్లి అమృత, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, ఆకివీడు


కోతలు తీవ్రతరం 

హైదరాబాద్‌ ఇన్‌ఫోసిస్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నా. కరోనాతో ఇంటి నుంచే పనిచేస్తున్నా. అయితే ఇటీవల గంటల కొద్దీ విద్యుత్‌ లేకపోవడంతో ఇన్వెర్టరు కూడా చార్జీంగ్‌ ఎక్కలేనంతగా పోవడంతో ఆఫీస్‌కు  వచ్చి పనిచేస్తామని చెప్పాం.

– మత్తి పూజిత, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, ఆకివీడు


కోతల వల్లే వెళ్లిపోతున్నా 

రెండేళ్లుగా కరోనాతో పాలకొల్లులో ఇంటి వద్దే ఉండి జాబ్‌ చేస్తున్నా. ఇటీవల కాలంలో రోజుకు ఆరు గంటలకుపైగా విద్యుత్‌ కోతల వల్ల వర్క్‌ చేయలేక ఇబ్బందులు పడడమే కాకుండా పైఅధికారులతో మాటపడాల్సి వస్తోంది. ఆఫీసులు తెరుస్తుండడంతో వర్క్‌ ఫ్రం హోమ్‌కు సెలవు చెప్పేసి రెండు రోజుల్లో హైదరాబాద్‌కు వెళ్లిపోతున్నా. 

 – టి.ప్రసన్నసాయి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, పాలకొల్లు


హైదరాబాద్‌ బయలుదేరా

మూడేళ్లుగా హైదరాబాద్‌లో టీసీఎస్‌లో జాబ్‌ చేస్తున్నా. గతంలో ఎన్నడూ ఈ విధం గా విద్యుత్‌ కోతలు చూడలేదు. విద్యుత్‌ కోతల వల్ల జాప్యం ఏర్పడుతోంది. పైగా షడన్‌గా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో లాప్‌టాప్‌ రిపేరుకు వచ్చేస్తోంది. అందువల్లే హైదరాబాద్‌కు వెళ్లాలని బయలుదేరా. 

– కాసాని కామ్యక, టీసీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, పాలకొల్లు


Updated Date - 2022-04-13T06:03:35+05:30 IST