నేడు ఛలో గుంటూరు జైలు...ముందస్తు అరెస్టు

ABN , First Publish Date - 2020-10-31T12:20:22+05:30 IST

రాజధాని రైతులకు బేడీలు వేయడానికి నిరసగా నేడు ఛలో గుంటూరు జైలు కార్యక్రమానికి టీడీపీ, సీపీఐ నేతలు పిలుపునిచ్చారు.

నేడు ఛలో గుంటూరు జైలు...ముందస్తు అరెస్టు

గుంటూరు: రాజధాని రైతులకు బేడీలు వేయడానికి నిరసగా నేడు ఛలో గుంటూరు జైలు కార్యక్రమానికి రాజధాని జేఏసీ నేతలు  పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలో టీడీపీ, సీపీఐ, అమరావతి జేఏసీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, టీడీపీ ఇన్‌చార్జ్‌లు కోవెలమూడి రవీంద్ర, నసీర్‌లను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు తీరుపై నేతలుు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 

కృష్ణాయపాలెం ఎస్సీ, బీసీ రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం,  వారికి సంకెళ్ళు వేసి జైలుకు తరలించడంపై రాజధాని జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్ట్‌లకు వ్యతిరేకంగా రాజధాని జేఏసీ నేతలు మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. మూడవ రోజు గుంటూరు జిల్లా జైల్‌కు భారీగా తరలిరావాలని ఛలో గుంటూరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు తుళ్ళూరు సహా అన్ని గ్రామాల్లో రైతులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. 

Updated Date - 2020-10-31T12:20:22+05:30 IST