Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుంటూరులో వరుస చెయిన్ స్నాచింగ్‌లు

గుంటూరు: గుంటూరు నగరంలో వరుసగా చెయిన్ స్నాచింగ్‌లు జరిగాయని అర్బన్ ఎస్పీ అరిఫ్ హాఫీజ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్నాచింగ్‌లు నల్లపాడు స్టేషన్ లిమిట్స్‌లోనే జరిగాయన్నారు. ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందితో చెప్పానన్నారు. మూడు చెయిన్ స్నాచింగ్‌ల్లోనూ వైట్ బైక్ వినియోగించినట్లు గుర్తించామన్నారు. దాని రిజిస్ట్రేషన్ నంబర్స్ తీసుకొని సీసీ కెమెరా విజువల్స్ సేకరించి నిందితులను పట్టుకున్నామన్నారు. ఇద్దరు చెయిన్ స్నాచర్స్‌ను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల దగ్గరి నుంచి 64 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఏ1గా ఉన్న పసుపులేటి సాయినాధ్‌పై రౌడీ షీట్ కూడా ఉందని అర్బన్ ఎస్పీ అరిఫ్ హాఫీజ్ తెలిపారు. 

Advertisement
Advertisement