అంకాలమ్మ గుడి వద్ద భారీగా హాజరైన వెలగచర్ల గ్రామ ప్రజలు
సంతోషంగా ఉండాలని చద్దిపోస్తూ ఒకరికొకరు దీవెనలు
పెనగలూరు, జనవరి 16: వెలగచెర్లలో సంక్రాంతి పం డుగ సందర్భంగా ఓ సంప్రదాయ రీతిలో అంకాలమ్మ గ్రామ దేవతకు చద్ది అన్నపు తిరునాళ్లు నిర్వహించారు. కనుమ పండుగ సందర్భంగా ఆదివారం అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేశారు. వెలగచెర్ల గ్రామ చుట్టుపక్కల ప్రజలందరూ పెద్ద చిన్న అన్న తేడా లే కుండా అందరూ హాజరై ఒక్కొక్కరి ఇంట్లో తయారు చేసిన చద్ది అన్నాన్ని తమ బంధువులకు పోశారు.
చద్ది అన్నం పోయడం అంటే ఏడాది పొడవునా ఆ కుటుంబా లు చద్ది అన్నంలా చల్లగా ఉండాలని, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ ఈ చద్ది అన్నాన్ని ఒకరికొకరు పంచుకున్నారు. సుమా రు 200 ఏళ్లగా సాగుతున్న చద్ది అన్నపు సంప్రదాయాన్ని ప్రజలు తమ బంధువుల మధ్య ఎంతో ఆత్మీయంగా భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున భక్తులు హాజరయ్యారు.
వెలగచెర్లలో అంకాలమ్మకు ప్రత్యేక పూజలు