బొమ్మవరం చెరువులో ఆగని మట్టి తరలింపు

ABN , First Publish Date - 2022-08-16T03:47:56+05:30 IST

రెండు రోజులుగా మండలంలోని బొమ్మవరం చెరువులో రాత్రిపూట అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి ఇటుక బట్టీలకు తరలిస్తున్నా

బొమ్మవరం చెరువులో ఆగని మట్టి తరలింపు
. అర్ధరాత్రి మట్టి తరలిస్తున్న టిప్పరు

అనంతసాగరం, ఆగస్టు 15: రెండు రోజులుగా మండలంలోని బొమ్మవరం చెరువులో రాత్రిపూట అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి ఇటుక బట్టీలకు  తరలిస్తున్నారు. అయాని పట్టించుకునేవారు కరవయ్యారు. మర్రిపాడు మండలానికి చెందిన ఓ వైసీపీ నేత కనుసన్నల్లో మట్టి దోపిడీ జరుగుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. తొలి రోజు శనివారం తవ్వకాలను అగ్రహారం గ్రామస్థులు అడ్డుకొన్నారు. అయితే ఆదివారం  అర్ధరాత్రి దాటక మట్టి తరలింపు  కొనసాగింది.  ఇకనైనా ఉన్నతాధికారులు ఈవిషయంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.


Updated Date - 2022-08-16T03:47:56+05:30 IST