ఆ ఇంటి గోడల నిండా పింగాణీ పాత్రలే!

ABN , First Publish Date - 2020-08-12T05:30:00+05:30 IST

ఇంటిని రకరకాల రంగులు, డిజైన్లలో అలంకరించుకునే వారు చాలామందే. అలానే కొందరు గోడలకు భిన్నమైన టైల్స్‌ వాడతారు. వియత్నాంకు చెందిన నుయెన్‌ వాన్‌ ట్రూంగ్‌ అనే వ్యక్తి కూడా తన ఇల్లు ప్రత్యేకంగా ఉండాలనుకున్నాడు...

ఆ ఇంటి గోడల నిండా పింగాణీ పాత్రలే!


ఇంటిని రకరకాల రంగులు, డిజైన్లలో అలంకరించుకునే వారు చాలామందే. అలానే కొందరు గోడలకు భిన్నమైన టైల్స్‌ వాడతారు. వియత్నాంకు చెందిన నుయెన్‌ వాన్‌ ట్రూంగ్‌ అనే వ్యక్తి కూడా తన ఇల్లు ప్రత్యేకంగా ఉండాలనుకున్నాడు. రకరకాల పింగాణీ పాత్రలతో తన ఇంటిని చక్కగా అలంకరించుకున్నాడు. పదివేల పింగాణీ పాత్రలతో ఇంటిని ఆకట్టుకునేలా మార్చేశాడు. అందుకోసం 25 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఇంటి లోపలి గోడలు, బయటి గోడలు పింగాణీ పాత్రలతో ఎంతో వైవిఽధ్యంగా కనిపిస్తాయి. వాన్‌ కొన్నాళ్లు ఆర్మీలో పనిచేశాడు. ఆర్మీ నుంచి రిటైర్‌ అయ్యాక సొంత గ్రామమైన కియుసన్‌లో ఉంటున్నాడు. తన ఇంటిని అందరి కన్నా భిన్నంగా తీర్చిదిద్దుకోవాలని అనుకున్నాడు. పదివేల పింగాణీ పాత్రలు సేకరించి, వాటిని ఇంటి లోపల, బయట అతికించాడు. ఇప్పుడు ఆ ఊరిలో వాన్‌ ఇల్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విభిన్నంగా ఉండే అతడి ఇంటిని చూసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. 

Updated Date - 2020-08-12T05:30:00+05:30 IST