Africa cheetahs : కునో పార్కుకు ఆఫ్రికా చిరుతపులులు

ABN , First Publish Date - 2022-09-12T13:20:01+05:30 IST

విదేశాల నుంచి అరుదైన చిరుతపులులను(cheetahs) మన దేశానికి తీసుకువచ్చి పునరుత్పత్తి ప్రాజెక్టు (cheetah reintroduction project new project)చేపట్టాలని...

Africa cheetahs : కునో పార్కుకు ఆఫ్రికా చిరుతపులులు

భోపాల్: విదేశాల నుంచి అరుదైన చిరుతపులులను(cheetahs) మన దేశానికి తీసుకువచ్చి పునరుత్పత్తి ప్రాజెక్టు (cheetah reintroduction project new project)చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దక్షిణాఫ్రికా, నమీబియా(Namibia and South Africa) దేశాల నుంచి 25కు పైగా చిరుతపులులను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని(Madhya Pradesh) కునో పాల్పూర్ జాతీయ పార్కుకు(Kuno-Palpur National Park) దశల వారీగా తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్(Union minister Bhupender Yadav) వెల్లడించారు. ప్రాథమికంగా ఏడు చిరుతపులులను ఈ నెల 17వతేదీన దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్ అటవీ ప్రాంతానికి తీసుకువస్తామని మంత్రి చెప్పారు. 


మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షియోపూర్ జిల్లాలోని ప్రత్యేకంగా నిర్మించిన ఎన్‌క్లోజరులోకి సెప్టెంబరు 17వతేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆఫ్రికా చిరుతలను ప్రవేశపెడతారని కేంద్రమంత్రి చెప్పారు. ఆఫ్రికా చిరుతల ప్రాజెక్టును మంత్రి భూపేంద్రయాదవ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్(MP Chief Minister Shivraj Singh Chouhan) తో సమీక్షించారు.చిరుత పులుల కోసం అటవీప్రాంతంలోని ప్రజలను తరలించి వారికి పునరావాసం కల్పిస్తామని సీఎం చెప్పారు.ఆఫ్రికా నుంచి చిరుతల పునరుత్పత్తి కోసం దేశంలో చేపట్టిన మొట్టమొదటి ప్రాజెక్టు అని సీఎం చెప్పారు.చిరుతల తరలింపు కోసం అటవీ ప్రాంతంలో 7 హెలీప్యాడ్లను కూడా నిర్మించారు.చిరుతలను హెలికాప్టర్లలో తరలించనున్నారు.


కాగా తీవ్ర పౌష్టికాహార లోపంతో (malnutrition)బాధపడుతున్న షియోపూర్ జిల్లా ప్రజలకు సహాయ పడకుండా విదేశీ చిరుతపులుల పునరుత్పత్తి పేరిట ప్రాజెక్టు చేపడుతున్నారని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం కమల్ నాథ్ విమర్శించారు.ముందు పిల్లలకు పౌష్టికాహారం అందించిన తర్వాతే చిరుతపులుల ప్రాజెక్టు అమలు చేయాలని కమల్ నాథ్ డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-09-12T13:20:01+05:30 IST